గోషా ఆసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రం..


Ens Balu
3
Visakhapatnam
2020-12-24 17:46:14

విశాఖలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రి (గోషా హాస్పిటల్) లో అత్యాధునిక స్కానింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చిందని, తద్వారా గర్భిణీ స్త్రీలకు అధునాతన వైద్యం అందుతుందని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.పివి సుధాకర్ అన్నారు. గురువారం ఆసుపత్రిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ .22 లక్షల విలువైన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ మెషీన్ లేబర్ రూమ్‌లో ఎంతో ఉపయోగంగా వుంటుందన్నారు. ప్రసూతి వైద్యులు కొత్త పరికరాలతో అత్యవసర సమయాల్లో స్కానింగ్ లు చేయడానికి ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. దీని ద్వారా అత్యవసర సమయంలో కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా వుందో కూడా తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. సంధ్య ఇన్చార్జి సూపరింటెండెంట్, డాక్టర్ యు.స్వరాజ్య లక్ష్మి సిఎస్ఆర్ఎంఓ, డాక్టర్ మెహర్ తదితరులు పాల్గొన్నారు.