క్షయ వ్యాధిని ఓడిద్దాం..దేశాన్ని గెలిపిద్దాం..
Ens Balu
5
Srikakulam
2020-12-25 18:04:25
క్షయ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కేసీ నాయక్ అన్నారు. నెల రోజుల పాటు జరగనున్న జాతీయ నిర్మూలన కార్య క్రమాన్ని శుక్రవారం నగరంలో ఆదివారం పేట అర్బన్ హెల్త్ సెంటర్ కార్యాలయంలో డిఎం అండ్ హెచ్ ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంధని, మందులు, పోషణ అందిస్తోందనీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా జనవరి 26వ తేదీ వరకు ఈ నెల రోజుల పాటు జరిగే క్షయ నిర్మూలన ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలందరూ వినియోగించు కోవాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ సిడి- సిడి సర్వేలో భాగంగా క్షయ వ్యాధిని కూడా అందులో చేర్చడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా క్షయ వ్యాధి అధిక ప్రాబల్యం గల ప్రాంతాల్లో, అధిక ప్రమాదం గల వ్యక్తులు అనగా షుగరు, బిపి, ఆస్మా, హెచ్ఐవి, క్యాన్సర్, కరోనా, కిడ్నీ మరియు గుండె వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్న పిల్లలు వంటి వారి మీద దృష్టిపెట్టి క్షయ పరీక్షలు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ బగాది జగన్నాధ రావు, డీఐఒ డాక్టర్ భారతి కుమారి, క్షయ నివారణ వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, జి. సురేష్ కుమార్ మరియు జిల్లా క్షయ నివారణ సంస్థ సిబ్బంది మరియు మెడికల్ ఆఫీసర్, అర్బన్ హెల్త్ సెంటర్, ఆదివారం పేట యు హెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.