42 వైద్యులు..84 స్టాఫ్ నర్సు పోస్టులకు ఇంటర్వ్యూలు..


Ens Balu
2
Visakhapatnam
2020-08-11 21:07:31

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం పరిధిలోగల ఈ అర్బన్ పి.హెచ్.సి లో 42 వైద్య అధికారి పోస్టులకు (ఎం.బి.బి.ఎస్ అర్హత గలిగి ఏ.పి. ఎం.సి.ఐ.రిజిస్ట్రేషన్ చేసుకొన్న అభ్యర్థులు), 84 స్టాఫ్ నర్స్ పోస్టులుకు (జి.ఎన్. ఎం/బి.ఎస్.సి.(నర్సు) అర్హత గలిగి ఏ.పి. నర్సిగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న ) అభ్యర్థులు  నియామకం కొరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ 17.8.2020 న ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం ప్రాంగణములో ఉదయం 10.00 గంటల నుండి ఎంపిక కొరకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ జెరాక్సు కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటోలతో హాజరు కావాలసినదిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.తిరుపతిరావు కోరారు.