సెక్స్ తో సహజసిద్ద అందం..ఆరోగ్యం..
Ens Balu
4
Visakhapatnam
2021-01-17 21:32:22
మానవ జీవితంలో శృంగారం అనేది మానసిక సంతృప్తితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనే విషయం అనేక అధ్యయనాల్లో తేలింది. తాజాగా సెక్స్ చేయడం ద్వారా అందం కూడా పెరుగుతోందని, మొహంలో మంచి కాంతి వస్తుందని కొందరు మహిళలు గమనించిన విషయం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం కూడా లేకపోలేదు. సెక్స్ చేయడం ద్వారా సుఖవంతమైన నిద్ర పట్టి తెల్లవారే సరికి మొహంలో కాంతి పెరుగుతుందని మహిళలు, సెక్స్ చేయడం వలన రోజంతా ఉత్సాహంగా వుంటుందని పురుషులు ఫీలవుతున్నారట. ఫిజికల్‌గా, మెంటల్ గా ఫిట్‌గా ఉండేలా చేస్తోందనీ, వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుందని పలు రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగలదని వైద్యులే సూచిస్తాను. అంతెందుకు క్రీడాకారులు సైతం ఆటకు వెళ్లడానికి గంట ముందు సెక్స్ లో పాల్గొనడం ద్వారా ప్రక్రుతి సిద్ధంగా వచ్చే ఉత్సాహాన్ని పెంపొందించుకుంటారని కూడా చెబుతారు. ఎవరైతే ఆరోగ్యకరమైన శృంగారాన్ని కొనసాగిస్తారో వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే సెక్స్‌కు, ఆరోగ్యానికి విడదీయరాని అనుబంధం ఉంటుందనే చెప్పాలి. అయితే చాలా మందిలో సెక్స్ విషయంలో అనేక అపోహలు, అనుమానాలు వున్నాయి. సెక్స్ అంటే వారికి ఒకరోజు, లేదంటే 15 రోజులకు ఒకరోజు చేయాలని బ్రమపడతారు. అలా కాకుండా ప్రతినిత్యం సెక్స్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మనచేతులతోనే చక్కగా ఉంచుకోవచ్చునని నిత్యం సెక్స్ పాల్గొనే వారిని చూస్తే తెలుస్తుంది.
తాజా పరిశోధనల్లో వయస్సు ప్రకారం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో చెప్తున్నారు పరిశోధకులు. కిన్సే ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సెక్స్, రీ ప్రొడక్షన్ అండ్ జెండర్ సంస్థకు చెందిన నిపుణులు ఈ అధ్యయనం చేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలను భహిర్గతం చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మానవ జీవితంలో శృంగారానికి, వయసుకు మధ్య ఉండే సంబంధం, ఆరోగ్యంపై సెక్స్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై వారు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ద్వారా ఏయే వయసుగల వారు ఎన్నిసార్లు సెక్స్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారో గుర్తించారు. వాటి ఫలితాలను చెప్పడం ద్వారా ఇపుడు చాలా మంది సెక్స్ విషయంలో స్పీడ్ గా వుంటున్నారు.
మిలీనియల్స్ (2000 సంవత్సరం తరువాత పుట్టినవారు) ఏజ్ గ్రూప్‌లో ఉన్నవారు, యుక్తవయస్సులోకి ప్రవేశించిన వ్యక్తులు ఎక్కువసార్లు సెక్స్ చేస్తున్నారని వారి అధ్యయనంలో తేలిందట. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు సంవత్సరానికి 112 సార్లు.. అంటే సగటున వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని వారి పరిశోధనల్లో తేలింది. అంతేకాదు సెక్స్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్పడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. సెక్స్‌కు దూరంగా ఉండేవారితో పోలిస్తే.. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే విద్యార్థుల్లో ఎక్కువ స్థాయిలో యాంటీబాడీస్ ఉన్నట్టు పెన్సిల్వేనియాలోని విల్కేస్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. రక్తపోటును తగ్గించడం, ఒత్తిడి, ఆందోళనను నివారించడం, ఆరోగ్యకరమైన నిద్రకు సహాయపడటం వంటి అనేక ఉపయోగాలు శృంగారం వల్ల కలుగుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్నవారు చెబుతున్నారట.
ఇకపోతే ఏవయస్సు వారు వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటే కూడా మంచిదో ఈ అధ్యయనం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. 30 నుంచి 39 సంవత్సరాల వయసు ఉండేవారు సంవత్సరానికి కనీసం 86 సార్లు సెక్స్ చేయాలట. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారు సంవత్సరానికి కనీసం 69 సార్లు సెక్స్ చేయాలట. వయస్సు పెరుగుతున్నా కొద్దీ శృంగారంపై ఆసక్తి తగ్గే అవకాశం ఉందికాబట్టి... సెక్స్ చేసే సామర్ధ్యం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలిందట. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేస్తూ పొట్ట పెరగకుండా చేసుకున్న వారిలో సెక్స్ ను ఎంజాయ్ చేయడంతోపాటు, ఆరోగ్యంగా ఉండి మందుకంటే మంచి ఫలితంతో ఒంటి నొప్పులు కూడా తగ్గాయనే విషయం కూడా కొంతమంది యువత చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కుటుంబ బాధ్యతలు, బిజీ వర్క్ షెడ్యూల్ వంటివి కూడా శృంగారంపై ఆసక్తి తగ్గేందుకు కారణాలని పరిశోధకులు చెబుతున్నా. వేల రూపాయల ఖర్చు చేసి సెక్స్ సామర్థ్యం పెంచుకునేకంటే బరువును తగ్గించుకొని, కొన్ని నియమాలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవడం ద్వారా సెక్స్ లో ఆనందంతోపాటు, ఆరోగ్యం, అందం పెంపొందించుకోవచ్చునని ప్రతీ ఒక్కరూ గమనించాలి.