జివిఎంసీ అధికారులకు కరోనా వేక్సిన్..


Ens Balu
3
Visakhapatnam
2021-02-05 20:45:50

జివిఎంసి కమిషనర్ డా.స్రిజన ఆదేశాల మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మీకులకు రెండవ దశలో వేక్సిన్ వేస్తున్నారు. శుక్రవారం ఈమేరకు నగరంలో గల 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలులో ఈ వేక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనది. ఇందులో భాగంగా ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి.) వై, శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు గణేష్ బాబు, స్టేటస్టికల్ ఆఫీసర్ రమణ మూర్తి తదితరులు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద కోవిడ్ వేక్సిన్  వేసుకున్నారు. వేక్సిన్ వేయించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వేక్సిన్ ఏర్పాట్లు బాగున్నాయని , మిగిలిన జివిఎంసి అధికారులు, సిబ్బంది, కార్మికులు వేక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిషీల్డ్, కోవేగ్జిన్ టీకాలు సురక్షితమైనవి అన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయ సిబ్బంది, జోనల్ స్థాయి సిబ్బంది, హెచ్.ఓ.డి.లు, జోనల్ కమిషనర్ల సహాయంతో కోవిడ్ వేక్సిన్ కొరకు తమ పేర్లును నమోదు చేసుకొని వేక్సిన్ వేయించోకోవాలని జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి  కార్పోరేషన్ అధికార్లును, సిబ్బందిని, కార్మికులను కోరారు.