Dr. YSR కంటివెలుగు డేటాను ఆన్లైన్ చేయాలి..
Ens Balu
3
Kakinada
2021-02-22 14:26:12
డా.వైఎస్సార్ కంటివెలుగు పథకానికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్ చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గత నవంబరు నెల నుండి జిల్లాలో 60 ఏళ్లు, ఆపై వయసు అవ్వా, తాతలకు డా.వై.ఎస్.ఆర్.కంటి వెలుగు పధకం క్రింద కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆప్తాలమిక్ ఆఫీసర్లకు ఆన్ లైన్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు టాబ్ లెట్ పిసి లను జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం తన ఛాంబరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన 41 టాబ్లెట్ పిసీల సహాయంతో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆప్తాలమిక్ ఆఫీసర్లను ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) కీర్తి చేకూరి, డిఎంహెచ్ఓ డా.గౌరీశ్వరరావు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా.మల్లికార్జున రాజు పాల్గొన్నారు.