ఇప్పటివరకూ 21.15 కోట్ల కోవిడ్ పరీక్షలు చేశారు..


Ens Balu
4
New Delhi
2021-02-22 17:13:05

భారత దేశంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21,15,51,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటలలో 6,20,216 పరీక్షలు జరిగాయన్న ఆరోగ్యశాఖ.. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల కోసం లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోందని పేర్కొంది. ప్రస్తుతమున్న 2393 లాబ్ లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1220 ఉండగా ప్రైవేట్ రంగంలో 1173 ఉన్నాయి. దీంతో రోజువారీ పరీక్షల సామర్థ్యం బాగా పెరిగింది. భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ శాతం 5.20% గా నమోదైంది. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంతా ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ వేక్సిన్ తీసుకోవాలని కూడా కేంద్రం కోరుతుంది.