25నాటికి కోవిడ్ వేక్సినేషన్ పూర్తిచేయాలి..


Ens Balu
4
Chittoor
2021-02-22 19:25:33

వైద్యాధికారులు సిబ్బందిలో వ్యాక్సిన్ కు సంబందించి పూర్తి అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆదేశించారు.సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్ కమిషనర్లు, తహాసిల్ధార్లు, ఎం.పి.డి.ఓ లు, ఈ.ఓ.పి.ఆర్.డి లు, వైధ్యాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్రంట్ లైన్ లో పని చేసిన వారందరికి రిజిష్టర్ అయిన ప్రకారం వ్యాక్సినేషన్ అయిన ప్రక్రియ ఈ నెల 25 వ తేది లోపల పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ లో పని చేసిన 37 వేల మందిలో 55 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని అయితే సమయం తక్కువగా ఉందని వ్యాక్సిన్ చేయించుకోవాలని కోవిన్ యాప్ నందు రిజిష్టర్ చేసుకున్న వారందరికి వ్యాక్సిన్ చేయాలని ఆయన అన్నారు. గతంలో కరోనా వైరస్ వ్యాది నివారణకు మండల స్థాయిలో ఈ.ఓ పి.ఆర్.డి లు ఏ విధంగా పని చేశారో అదే విధంగా వ్యాక్సినేషన్ విషయంలో టీంలను ఏర్పాటు చేసుకొని రిజిష్టర్ చేసుకున్న వారికి 48 గంటల ముందే ఫోన్ ద్వారా కానీ లేదా టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా సమాచారం ఇచ్చి వారు వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. ఎం.పి.డి.ఓ లు, ఎం.ఆర్.ఓ లు ఈ ప్రక్రియ కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్ లుగా పనిచేసిన వారు క్షేమంగా ఉండాలని ప్రభుత్వం భావించి వారికి ప్రాదాన్యత ఇవ్వబడిందని వారందరూ దీనిని ఉపయోగించుకోవాలని, దీనిని పర్యవేక్షిస్తున్న అధికారులందరూ అత్యంత బాధ్యతగా తీసుకొని మూడు రోజులలోపు రిజిష్టర్ అయిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ సంధర్భంగా వ్యాక్సినేషన్ లో వెనుకబడిన సంస్థలు, ఆసుపత్రుల సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న మినహా అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అలారాని పక్షంలో వారిలో అవగాహన కల్పించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొంత మంది వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి సిద్దంగా ఉన్న సెషన్స్ లో వారి పేరు రిజిష్టర్ కాకపోతే డివిజన్ లేదా జిల్లా వైధ్య అధికారుల దృష్టికి తీసుకొని రావాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా నిర్దేశించిన అధికారులందరూ ఉన్న 72 గంటల సమయాన్ని బాధ్యతా యుతంగా వెచ్చించి ఫలితాలను సాదించాలన్నారు.           జిల్లాలో ఇటీవల కరోనా కేసులు నమోధవున్నాయని కాంటాక్ట్ ట్రెసింగ్ లో గతంలో పాటించిన పద్దతుల లాగే వాలంటీర్ల నుంచి ఈ.ఓ.పి.ఆర్.డి ల వరకు ఖచ్చితమైన కాంటాక్ట్ లను గుర్తించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సరైన చికిత్స అందించడంతో పాటు వారి కాంటాక్ట్ లను హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ లో ఉంచితే కేసులు పెరగవని కలెక్టర్ అన్నారు. గతంలో వందల సంఖ్యలు వచ్చిన సమయంలోనూ సైనికుల వలె పని చేశారని ప్రస్తుతం కొద్ది రోజుల పాటు కష్ట పడితే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించ గలమని జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరికి సూచించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల ట్రెసింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు వహించాలని, పాజిటివ్ కేసు వచ్చిన వారికి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చికిత్స లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వారి ఆరోగ్యం పట్ల తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. దీనికి సంబందించి టెస్టుల సంఖ్యను పెంచాలని గతంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ లు పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే స్పందించాలని వారి కాంటాక్ట్ లను గుర్తించి వారికి పరీక్షలు చేయించాలన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల లోనే చైన్ ను బ్రేక్ చేయాలని లేకుంటే మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కాంటాక్ట్ లు ట్రెసింగ్ తూ తూ మంత్రంగా కాకుండా ఖచ్చి తత్వం పాటించాలని అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకోవాలని అన్నారు. మండల స్థాయిలో ఎం పి.డి లు, ఎం ఆర్ ఓ లు వైధ్యాదికారులతో సంప్రదించి ఎక్కడి నుంచి పాజిటివ్ కేసులు కానీ వారి కాంటాక్ట్ లు కానీ వస్తున్నాయో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని కేసులు పెరగకుండా నివారించాలన్నారు.             ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మo, డి ఎం అండ్ హెచ్ ఓ డా.పెంచలయ్య, సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.పి.ఓ దశరధ రామి రెడ్డి, డి.సి.హెచ్.ఎస్ డా.సరళమ్మ, ఎన్.హెచ్.ఎం శ్రీనివాస్, డిప్యూటి డి ఎం అండ్ హెచ్ ఓ డా.రమా దేవి, చిత్తూరు కోవిడ్ అధికారి డా.మహేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.