ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యం అందాలి..


Ens Balu
2
Vizianagaram
2021-02-23 17:11:10

 ఆసుపత్రులకు వచ్చే ప్రతీ ఒక్క ఆరోగ్య శ్రీ పేషెంట్ కు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సంయుక్త కలెక్టర్ డా.మహేష్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల ప్రతినిధులతో నిర్వహించారు.    ఆసుపత్రి వారీగా ఆరోగ్యశ్రీ రోగులకు అందిస్తున్న సేవల గురించి సమీక్షించారు.  ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రోగులకు  వైద్య సేవలను అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది, నిధులను సమకూర్చుకొని ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.  ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి డా.యు. అప్పలరాజు, ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డా. జి.నాగభూషణరావు,  జిల్లా స్కిల్ డవలెప్మెంటు అధికారి డా. సాయి శ్రీనివాసరావు, అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రైవేట్ ఆసుపత్రుల ఎం.డి. పాల్గొన్నారు.