డీవార్మింగ్ డేని విజయవంతం చేయాలి..
Ens Balu
2
Srikakulam
2021-02-24 19:46:54
బాల స్వాస్త్య కార్యక్రమం క్రింద మార్చి 3 న డీ వార్మింగ్ డే కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో జిల్లా కలెక్టర్ జె.నివాస్, డి-వార్మింగ్ డే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా మార్చి 3న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోను మరియు జూనియర్ కళాశాలలలోని విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్జోల్ -400 మి.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఉదయం 8.00 గం.ల నుండి సాయంత్రం 5.00 గం.ల వరకు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, అంగన్వాడీ కేంద్రాలలోని పిలల్లతో కలిపి మొత్తం 5 లక్షల, 98 వేల 65 మందికి డీ వార్మింగ్ మాత్రలు ఇవ్వవలసి వుంటుందని. ఇందులో ఏ ఒక్కరూ తప్పిపోరాదని అన్నారు. కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహించాలని చెప్పారు. బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి మాట్లాడుతూ, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పర్యవేక్షణలో పాఠశాలలకు మార్చి 1వ తేదీ నాటికి పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించడం జరుగుతుందని, గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వఛ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు వుండవని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాధం, రామిరెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రిన్సిపాల్ డా.ఎ.కృష్ణవేణి, సర్వ శిక్ష అభయాన్ ప్రాజెక్టు అధికారి పైడి వెంకటరమణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ఐ.సి.డి.ఎస్. పి.డి. జయదేవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమల, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వెంకట రత్నం డిప్యూటీ డి.ఇ.ఓ.విజయకుమారి, రోటరీ క్లబ్ సభ్యులు మంత్రి వెంకటస్వామి, లయన్స్ క్లబ్ సభ్యులు డా.కె.కృష్ణ మోహన్, దేవ భూషణ రావు, తదితరులు పాల్గొన్నారు.