వాక్సినేషన్ లో శ్రీకాకుళం ముందంజ..
Ens Balu
3
Srikakulam
2021-02-25 21:20:45
కోవిడ్ వాక్సినేషన్ లో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు గురు వారం తెలిపారు. హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సినేషన్ లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 19,727 మంది హెల్త్ వర్కర్లు పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 15,694 మంది మొదటి విడత వాక్సిన్ వేసుకున్నారని, 10,061 మంది రెండవ విడత వాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. రెండవ విడతలో 9,198 మంది కోవీషీల్డు వాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. నమోదు చేసుకున్న వారికి మొత్తం 79.44 శాతం వాక్సినేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 64.71 శాతం వాక్సినేషన్ జరుగగా నెల్లూరు జిల్లా 70.80 శాతంతో రెండవ స్ధానంలోను, విజయనగరం జిల్లా 69.19 శాతంతో మూడవ స్ధానంలోనూ నిలిచాయని తెలిపారు. ఫ్రంట్ లైన్ శాఖలైన రెవిన్యూ, పంచాయతీ, మునిసిపాలిటి, పోలీసు శాఖలకు జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమంలో సైతం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 25,808 మంది రెవిన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 15,262 మందికి వాక్సిన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మునిసిపల్ సిబ్బంది 4,040 మంది నమోదు చేసుకోగా 2,715 మందికి వాక్సినేషన్ పూర్తి అయిందని అన్నారు. పోలీసు సిబ్బంది 2,246 మంది నమోదు చేసుకోగా బుధ వారం నుండి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయిందని 1,421 మంది వాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. రెవిన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బందిలో 59.13 శాతం మందికి, మునిసిపాలిటీ సిబ్బందిలో 67.20 శాతం, పోలీసు సిబ్బందిలో 63.26 శాతం మందికి వాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు.