సెకెండ్ వేవ్ కరోనాకి కేజిహెచ్ గేట్ వే..


Ens Balu
1
Visakhapatnam
2021-02-26 11:15:10

విశాఖలో సెకెండ్ వేవ్ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి.. రెండవసారి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయనే ప్రచారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరికి కరోనా ఉందో, ఎవరు వైద్యం పొందుతున్నారో తెలియకపోవడం మరింత ఆందోళనక కలిగిస్తుంది. ముఖ్యంగా  ఉత్తరాంధ్రా జిల్లాలకు ఆరోగ్య ప్రధాయినిగా వున్న కేజిహెచ్(కింగ్ జార్జి ఆసుపత్రి) దీనికి గేట్ వే మారిపోయిందనే వాదన గట్టిగా ప్రజల్లో నాటుకుపోయింది.. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది..విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ జిల్లాల నుంచే కాకుండా ఒడిసా, చత్తీస్ ఘడ్ ప్రాంతాల నుంచి కూడా ఏ చిన్న రోగమొచ్చినా అందరూ కేజిహెచ్ నే సంప్రదిస్తున్నారు రోగులు. ప్రభుత్వ ఆసుపత్రి కావడం కోవిడ్ కేర్ సెంటర్ కావడంతో కెజిహెచ్ కి రోగుల తాడికి అధికంగా వుంటుంది. ఈ క్రమంలోనే ఏ రోగికైనా కరోనా పాజిటివ్ అని తేలితే వీరికి వైద్యం చేసే వైద్యసిబ్బందికి కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, మినిస్టీరియల్ స్టాఫ్ వున్న ఈ కెజిహెచ్ లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు కూడా ఒక ప్రతిబంధకంగా పరిణమిస్తోంది. కెజిహెచ్ లో పనిచేసే వారికి కూడా ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. దీనితో బయోమెట్రిక్ వేసే విషయంలో ప్రతీఒక్కరూ భయపడుతున్నారు. కరోనా కేసులు తగ్గేవరకైనా ఈ బయోమెట్రిక్ విషయంలో అధికారులు వెసులుబాటు కల్పించకపోవడంతో ఇటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మొత్తం భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. రోగులకు వైద్యసేవలు అందించేవారు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యేటపుడు ఔట్ బయోమెట్రిక్ వేయాల్సి వుంటుది. ఆ సమయంలో ఏఒక్క పారామెడికల్ సిబ్బందికిగానీ, ఉద్యోగికిగానీ, వైద్యుడికి గాని కరోనా పాజిటివ్ వస్తే..అది కాస్త కేజిహెచ్ మొత్తం చుట్టేసే ప్రమాదం లేకపోలేదు. అందులోనూ ఇక్కడకు వచ్చే వందలాది మంది రోగులకు వైద్యచేసే విషయంలో కూడా పారామెడికల్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎలాంటి సేవలు అందించాలన్నా ఇటు కార్యాలయ సిబ్బందిని మరింత భయంతో విధులు నిర్వహించాల్సి వస్తుంది. సెకెండ్ వేవ్ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కెజిహెచ్ తోపాటు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయోమెట్రిక్ హాజరు మినాయింపు ఇవ్వడం ద్వారా కరోనా పాజిటివ్ కేసులు ఒకరి నుంచి మరొకరి రాకుండా ఉంటాయనే వాదన బలంగా వినిపిస్తుంది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతోనే కెజిహెచ్ లోని సిబ్బంది, పారామెకల్ స్టాఫ్, వైద్యులు, కార్యాలయ సిబ్బందికి బయో మెట్రిక్ తప్పనిసరి చేశామని చెబుతున్నారు కెజిహెచ్ ఉన్నతాధికారులు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు వస్తే తప్పా మరోసారి కెజిహెచ్ కి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే తమ ద్రుష్టికి ఈ విషయం వచ్చిందని సూపరింటెండెంట్ కార్యాలయం పేర్కొంటుంది. జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో ఈ విషయాన్ని పెట్టి అపుడు నిర్ణయం తీసుకునేలా కెజిహెచ్ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్నట్టు జరిగితే ఆసుపత్రిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ సిబ్బందికి ఈ వైరస్ సోకే విషయంలో కాస్త ఉపసమనం లభిస్తుంది. లేదంటే కెజిహెచ్ గేట్ వేగా మరోసారి కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతాయనే భయం ఇక్కడి అధికారులను, సిబ్బందిని, వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని పరుగులు పెట్టిస్తుంది. శానిటైజర్లు, మాస్కులు ఇలా స్వీయ నియంత్రణ పాటించినప్పటికీ విశాఖలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఇటు వైద్య ఆరోగ్యశాఖను, ఇతర ప్రభుత్వశాఖల అధికారులను కలవరపాటుకి గురిచేస్తుంది..ఇదే సమయంలో కరోనా వేక్సిన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్యులకు వేస్తున్నప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతుండటం అన్ని వర్గాల ప్రజలకు ఆందోళనకు చెందేలా చేస్తోంది..