కోవిడ్ టీకా వేయించుకున్న జెసి..
Ens Balu
4
Vizianagaram
2021-02-26 21:25:42
ప్రభుత్వ అధికారులు సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ టీకా వేయించుకోవాలని జెసి డా.కిషోర్ కుమార్ సూచించారు. ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ప్రభుత్వ అధికారులకు అందించి ఈ వేక్సిన్ పై అపోహలు వీడాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోవిడ్ టీకాను జెసి వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెవెన్యూ, మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు, సిబ్బందికి కోవిడ్ నిరోధక టీకా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేయించుకున్నానని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి ఆధ్వర్యంలో వైద్య బృందం టీకా వేశారు. ఈ టీకా ఎంతో సురక్షిత మైనదని, అపోహలు వీడి ప్రతి ఒక్కరూ తమకు అవకాశం వచ్చినప్పుడు తప్పని సరిగా వేయించుకొని కోవిడ్ నుండి రక్షణ పొందాలని సూచించారు.