జిజిహెచ్ లో కలర్ డాఫ్లర్ మెషిన్..


Ens Balu
12
Srikakulam
2021-03-09 15:33:48

 శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి లో కలర్ డాప్లర్  మెషిన్ అందుబాటులోనికి వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.క్రిష్ణమూర్తి తెలియజేశారు. మంగళవారం ఆసుపత్రిలో ఆయన దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మెషిన్ ద్వారా శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ  పరీక్షించుటకు ఉపయోగ పడుతుందన్నారు. శస్త్ర చికిత్సల నిపుణులు డా.అపరంజి దీనిని పర్యవేక్షణ చేస్తారని వివరించిన ఆయన సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ఆపరేషన్ థియేటర్ లో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు.ఈ యూనిట్ డాప్లర్ మెషిన్ వలన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిపుణులు, మత్తు వైద్య నిపుణులు డాప్లర్ మెషిన్ ఏర్పాటు పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.