నిర్భయంగా కో వ్యాక్సిన్ వేయించుకోండి..


Ens Balu
4
Paderu
2021-03-12 17:42:03

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిర్భయంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సమీకృత పాడేరు గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల పిలుపు నిచ్చారు. శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయం సముదాయంలో ఉన్న వివిద శాఖల ఉద్యోగులకు ప్రాజెక్టు అధికారి స్వీయ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కృష్ణారావు అధికారులకు , ఉద్యోగులకు వ్యాక్సినేషన్ టీకాలను వేసారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ వేక్సినేషన్ వేయించుకున్న సిబ్బంది వ్యాయామం చేయకుండా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలన్నారు. తాను నిన్ననే వ్యాక్సినేషన్ వేయించుకున్నానని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని, ఆందోళన చెందవలసిన అవసరంలేదని, కొన్ని నియమాలు పాటించాలన్నారు. మూడు రోజులు వ్యాయామం, మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటివి చేయకూడదన్నారు. ఐటిడి ఏ కార్యాలయం సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్, విద్యా విభాగాలలో మొత్తం 40 మందికి డాక్టర్ కృష్ణారావు కోవిడ్ వ్యాక్సినేషన్ వేసారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు, అదనపు జిల్లా వైద్యాధికారి డా. లీలా ప్రసార్, వైద్య సిబ్బంది సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.