అందరి సహకారంతో అరుదైన గుర్తింపు..


Ens Balu
4
Visakhapatnam
2021-03-15 17:52:12

అందరి సమిష్టి కృషి వలనే విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్య శాలకు ISO సర్టిఫికేషన్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  సోమవారం ప్రభుత్వ మానసిక వైద్య శాలలో ఏర్పాటు చేసిన ISO9001-2015  సర్టిఫికేషన్(ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్)  ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మానసిక వైద్య శాలకు ISO 9001-2015  సర్టిఫికేషన్ రావడం చాలా సంతోషమన్నారు.  అందరి సమిష్ట కృషి వలనే ISO 9001-2015 సర్టిఫికేషన్ వచ్చిందని తెలిపారు.  సిబ్బంది, విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు అందరిని ఆయన అభినందించారు.  ఇదే విధంగా మెంటైనెన్స్ చేయాలన్నారు.  ప్రభుత్వ మానసిక ఆసుపత్రిని గుర్తించి ISO9001-2015  సర్టిఫికేషన్ ఇచ్చిన ఆలపాటి శివయ్యకు ధన్యవాదాలు తెలిపారు.  ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆసుపత్రికి వచ్చే మానసిక రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరిన్ని సదుపాయాల కో్సం జిల్లా కలెక్టర్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాధారాణి కోరగా సర్క్యులర్ పంపాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎం.డి. ఆలపాటి శివయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మానసిక వెైద్యశాలను పరిశీలించగా పారిశుద్యం, సిబ్బంది కో-ఆర్డినేషన్, ఫైర్ సేఫ్టీ, మందులు సరఫరా, తదితరమైనవి పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.  పరిశీలనలో  అవసరమైన కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు.  ఈ సర్టిఫికేట్ మూడు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.   ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, మానసిక వైద్య శాఖ పర్యవేక్షకులు డా. ఎస్. రాధారాణి మాట్లాడుతూ మానసిక వైద్య శాలకు ISO 9001-2015  సర్టిఫికేషన్ చాలా సంతోషమన్నారు.   ఈ కార్యక్రమంలో చెస్ట్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. కె.వి.వి. విజయ్ కుమార్, మానసిక వైద్య శాల సీనియర్ ప్రొఫెసర్ హిమకర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.