రోజుకి 32 వేల మందికి కరోనా వేక్సిన్..


Ens Balu
3
Visakhapatnam
2021-03-19 15:08:48

విశాఖజిల్లాలో రోజుకి 32 వేల మందికి కరోనా వేక్సిన్ వేయాలని వైద్యఆరోగ్యశాఖ కు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. దీనితో రంగంలోకి దిగిన  కలెక్టర్ వినయ్ చంద్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా వైద్యాధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణకు దిశా నిర్ధేశం చేశారు. కరోనా వేక్సిన్ వేసేందుకు నగరంతోపాటు జిల్లాలోనూ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసచివాలయాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కరోనా వేక్సిన్ వేయించి జీరో కరోనా కేసులకి చేరే విధంగా చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ఆధారంగా వేక్సిన్ వేస్తున్నామని, ఇపుడు ఆ సంఖ్యను పెంచి అన్ని వర్గాల వారికీ కరోనా వేక్సిన్ వేస్తున్నామని డిఎంహెచ్ఓ ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున్న కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ఆదారంగానే ఇప్పటి వరకూ వేక్సిన్ వేస్తూ వస్తున్నామన్నారు. ఇపుడు అన్ని పీహెచ్సీల వైద్యులతో సమావేశాలు నిర్వహించి ప్రతీ ఒక్కరికీ కరోనా వేక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేపటి నుంచే లక్ష్యాలను అదిగమించడానికి అధికారులను, వైద్య, పారామెడికల్ సిబ్బందిని సిద్దం చేసినట్టు డిఎంహెచ్ఓ వివరించారు. మరోవైపు కరోనా కేసులు పెరగకుండా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కూడా ఆయన సూచించారు. తరచుగా సబ్బుతో మొహం, చేతులు, కాళ్లు కడుక్కోవడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండవచ్చునన్నారు.