కరోనా సమయంలో బలవర్ధక ఆహారం తీసుకోవాలనుకునే వారికి మిక్సిడ్ వెజ్ కర్రీ ఎంతో ఉపయోగంగా వుంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అన్ని రకాల కూరగాయలను కూర చేసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, కాల్సిషియం మోతాదులు బాగా శరీరంలోకి చేరుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చిబటానీ, పన్నీరు, క్యాప్సికమ్, పుట్టగొడుగులు, ఆకుకూరలు, కాలీఫ్లవర్, బంగాళదుంప, బేబీకార్న్, టామాటా, కొత్తిమీర, మెంతికూర, కేరెట్, బీట్ రూట్, ముల్లంగి, క్యాబేజీలను కలుపుకొని ఈ మిక్స్ డ్ వెజ్ కర్నీ తయారు చేసుకోవడం ద్వారా పోషక విలువలు అధికంగా చేరుతాయని చెబుతున్నారు. కరోనా సమయంలో బలవర్ధక ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ రకంగా చేసుకోవడం ద్వారా శరీరానికి మంచి ఆహారం అందించిన వారవుతారని చెబుతున్నారు. కూరలన్నీ నువ్వుల నూనెతోగానీ, బటర్ తో చేసుకోవడం ద్వారా రుచికి రుచితోపాటు, ఆరోగ్యం కూడా సొంతమవుతుందంటున్నారు. వీటితోపాటు దానిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీ జ్యూస్ ల ద్వారా సి విటమిన్ బాగా శరీరంలోకి చేరుతుందన్నారు. జామకాయ, మామిడి పళ్లను, కేరెట్, బీట్ రూట్ లను నేరుగా తీసుకోవడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది ఇవి తీసుకోవడంతో పాటు మజ్జిగ, తరచూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.