కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న సమయంలో మాత్రల రూపంలో వచ్చే ఆరోగ్యం బొప్పాయి పండు తీసుకోవడం ద్వారా కలుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటే అతిశయోక్తి కాదు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు లభిస్తాయని సూచిస్తున్నారు. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరం వుంటుంది. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలని వైద్యులు సూచిస్తుంటారు. కరోనా సమయంలో పడిపోయే ప్లేలెట్లను పెంచడానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగ పడుతుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు రసం కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది. ఆకు రసాన్ని తాగలేని వారు నేరుగా బొప్పాయిని తీసుకోవచ్చు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం లోకి వైరస్ నిల్వ ఉండే పరిస్థితి వుండదు. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది. మందుల ద్వారా విటమిన్లు కోసం ఆరాటపడేకంటే సహజసిద్ధంగా దొరికే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి, అందానికి అందం రెండూనూ...ఏమంటారు.