మన నిత్యజీవితంలో ఎదరుయ్యే రుగ్మతలు, రోగాలు, చర్మవ్యాధులకు నేల ఉసిరి(భూ ఆమ్ల) దివ్యఔషదంగా పనిచేస్తుంది. దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే ఖచ్చితంగా పెరటితోటలో దీనిని పెంచుకుంటారంటే అతిశయోక్తి కాదేయో..కామెర్లు ఇంగ్లీష్ లో జాండీస్ అని పల్లెటూర్లలో పసిరికలు అని అంటారు. నేల ఉసిరి లో హెపటైటిస్ బి అనే వైరస్లను నిర్మూలించే శక్తి అధికంగా ఉంటుంది. ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొని వచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు మనకు వెంటనే తగ్గుతాయి. అటు చర్మ వ్యాధులైన గజ్జి తామర ఎక్కువగా బాధపడేవారు ఈ మొక్కను తీసుకొనివచ్చి మెత్తగా దంచుకొని ఒక ముద్దలా చేసుకుని ఉప్పుతో కలిపి గజ్జి తామర ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా నూరి విరిగిన దేశంలో ఉంచి కట్టుకట్టినట్లయితే అక్కడ నొప్పి వాపు తగ్గి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.
మరీ ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నేల ఉసిరి మొక్కలో కాల్షియం ఆక్సలేట్ ను కరిగించే శక్తి ఉండటం వలన మూత్రపిండాలలోని రాళ్లు ఇది కలిగిస్తుంది. 2004లో జరిగిన పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఈ విషయం వెల్లడించారు. నేల ఉసిరి మొక్కను ఒక కషాయంలా చేసుకొని తాగడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి. పైగా మూత్ర సంబంధిత సమస్యల నివారణకు ఈ మొక్కచక్కగా పనిచేస్తుంది. ఈ మొక్కలోని వేర్లతో సహా తీసుకువచ్చి దీనిని మెత్తగా నూరి, వెలక్కాయ లోపల గల గింజల పొడిని ఒక భాగము, జీలకర్ర పొడి ఒక భాగము ఈ మూడింటిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడడం వలన ఉపశమనం లభిస్తుంది.
పాము కాటు విరుగుడు కు ఈ మొక్కను మెత్తగా నూరి పాము కరిచిన ప్రదేశంలో ఉంచితే విషయము లోపలికి ఇవ్వకుండా చేస్తుంది తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. చాలా మందికి వెక్కిళ్ళు ఎక్కువగా రావడం ఆకలి లేకపోవడం సమస్యతో బాధపడే వారు నేల ఉసిరి ఆకు ఉదయము సాయంత్రము నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పైగా వైరస్ వలన వచ్చే జ్వరాలు, అనేక వైరస్ల వల్ల వచ్చే జ్వరాలు అని తగ్గించడానికి ఈ మొక్క ఆకులను బాగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయము సాయంత్రము తీసుకోవాలి. వీటితో పాటు మరెన్నో రోగాలకు నేల ఉసిరి చాలా చక్కగా పనిచేస్తుంది..