అమాయక గిరిజనుల మాన, ప్రాణాలను తీస్తూ పాసవిక ఆనందాన్ని పొందే మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వాన్ని అల్లూరి సీతారామరాజు కంటే ముందుగా భయపెట్టింది మిరపకాయ్ టపా...తమకు ఎదురులేదని విర్రవీగిన తెల్లవాడికి కంటినిండా నిదుర లేకుండా చేసిన మిరపకాయ్ టపా స్రుష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఒకరకంగా చెప్పాలంటే బ్రిటీషు సైన్యం చేసిన తప్పును నీడలా వెంటాడి తెల్లవాడి ఆత్మస్తైర్యాన్ని దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించనది కూడా ఈ మిరపకాయ్ టపా అనే చెప్పాలి(మిరపకాయ్ టపా అంటే బాణానికి వర్తమాన కాగితం గుచ్చి దానిముందు ఎర్రగా పండిన మిరకాయని గుచ్చి వింటి ద్వారా పంపే వర్తమానం. అల్లూరి సీతారామరాజు ఉన్నచోట నుంచి మరొక చోటుకి దీనిని సంధించే వారు. బాణం చేరుకున్న ప్రదేశం నుంచి సైన్యంలో నమ్మకమైన వ్యక్తి మరొకరు దానిని చేరాల్సిన ప్రదేశానికి సంధించేవారు. అల్లూరి నుంచి మిరపకాయ్ టపా గమ్యం చేరుకోవడానికి ఐదు దశలు దాటేదని చెబుతారు. ఒక్కోసారి 300 అడుల దూరంనుంచి నేరుగా అల్లూరి సీతారామరాజే ఈ మిరపకాయ్ టపాను బ్రిటీషు సేనలు ఉండే ప్రాంతానికి సంధించేవారని చరిత్ర చెబుతోంది...). విశాఖ మన్యంతోపాటు, తూర్పుగోదావరి గిరిజన గూడేల్లో అమాయక గిరిజన మహిళలను విచక్షణా రహితంగా చెరబట్టి విక్రుత చేష్టలకు పాల్పడేది బ్రిటీషు ప్రభుత్వం. అందులో మేజర్ గుడాల్ బ్రుంధం చేసే అరాచకాలు అన్నీ ఇన్నీకావు. మహిళలపై అత్యాచారాలు చేసి, వివస్త్రను చేయడంతో పాటు పండిన ఎండుమిరపకాయలను చిదిమి వాటితో మహిళల మర్మావయాలను తాకుతూ...గిరిజన మహిళలు చేసే హాహా కారాలను వింటూ సునకానందం పొందేవారు బ్రిటీషు సేనలు. ఏ ప్రాంతంలో పనులు జరుగుతుంటే ఆ ప్రాంతాలకి దినసరి కూలివచ్చే వారిపై బ్రిటీషు సైన్యం చేసే ఈ విక్రుత క్రీడ యావత్ తెల్లవాడి ప్రభుత్వానికే శాపంగా మారింది. గిరిజనుల మాన ప్రాణాలను అత్యంత దారుణంగా తీసేస్తున్న సమయంలో అల్లూరి సీతారామరాజు వారిని దేవుడిలా రక్షించే ప్రయత్నం చేశారు. ఏ తరహా విక్రుత చర్యలతో గిరిజన మహిళలపూ అత్యాచారం చేసేవారో అదే విధానాన్ని బ్రిటీషు సేనలకు తెలియచెప్పాలని నిర్ణయించుకున్న అల్లూరి తన ఉద్యమంలో మిరపకాయ్ టపాను కీలకంగా మార్చారు. తాము చేసిందే శాసనం, చెప్పిందే మాటగా రాజ్యమేలుతున్న బ్రిటీషు ప్రభుత్వానికి తొలుత హెచ్చరిక పంపినది కూడా ఈ మిరపకాయ్ టపాతోనే. అల్లూరి సీతారామరాజు మన్యం పితూరీ చేస్తున్న సమయంలో తెల్లవాడికి అల్లూరి సేన ఎదిరించే కార్యక్రమాలన్నీ ఈ మిరపకాయ్ టపాతోనే వర్తమానం పంపేవారట అల్లూరి. విశాఖ మన్యంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు, బ్రిటీషు సేనలకు ఎందు వర్తమానం పంపేసమయంలో పండు మిరపకాయ్ ఎందుకు పంపేవారో తొలుత అర్ధమయ్యేది కాదు. ఈ టపాపై బ్రిటీషు సేనలు అమాయక గిరిజనులను కూడా దారుణంగా హింసించి దానికి కారణం కూడా చెప్పమనేవారట. ఆ విషయం గిరిజనులకు కూడా తెలిసేది. దీంతో బ్రిటీషు సేనలు పెట్టే హింసలను అనుభివస్తూనే అల్లూరి సీతారామరాజు మన్యంపితూరికి పూర్తిస్థాయిలో సహకారం అందించేవారు అమాయక కోయ గిరిజనులు. ఈ తరుణంలోనే విశాఖజిల్లా, చింతపల్లి తాలూకా దామనాపల్లి ఘాట్ వద్ద అల్లూరిని ఎదిరించే క్రమంలో యుద్ధంలో రాటు దేలిన హైటర్, కవర్ట్ లను అల్లూరి సీతారామరాజు మట్టికరిపించారు. వీరికి బ్రిటీషు ప్రభుత్వంలోనే తిరుగులేని సైన్యకాపరిలుగా గుర్తింపు వుంది. ఆ సమాచారాన్ని కూడా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి ఈ మిరపకాయ్ టపాద్వారానే వర్తమానం పంపారు. ఈ టపా సారాంశం ఏంటంటే నన్ను అంతమొందించడానికి పంపిన నీ సైన్యం మా తిరుగుబాటుదారుల చేతిలో కుక్కచావు చచ్చింది, మీ సైన్యం శవాలను రూ.500 సుంకం చెల్లించి తీసుకెళ్లండి అనేది ఆ వర్తమానంలో ఉన్న అంశం. అయితే నేరుగా అల్లూరి ఉన్న ప్రాంతానికి యుద్ధం జరిగిన రోజు చేరుకోలేని తెల్ల సైన్యం మరుసటి రోజు వారి మ్రుత దేహాలను పన్ను కట్టి హైటర్, కవర్ట్ మ్రుతదేహాలను తీసుకొచ్చి...యుద్ధంలో వీరమరణం పొందారని(1922 సెప్టెంబరు 24) సమాధులపై రాసి వారి మ్రుత దేహాలను నర్సీపట్నంలో సమాది చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నర్సీపట్నం ఆర్ అండ్ బి బిల్డింగ్( నాటి బ్రిటీషు ప్రభుత్వ కార్యాలయ సముదాయం) కి కూత వేటు దూరంలోనే వుంటుంది. బ్రిటీషు యుద్ధవీరులు అల్లూరి చేతిలో మ్రుతి చెందారంటే ఆయన అంగబలం ఏపాటిదో కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి అర్ధమైపోయింది. ఒక్కసారిగా ప్రభుత్వం తమ యుద్ధానికి కొద్ది రోజులపాటు విరామం ప్రకటించింది. అదే సమయంలో ఈ విషయాన్ని కలెక్టర్ రూథర్ ఫర్డ్ తన విశస్వనీయ సేనాధిపతులతో చర్చించే సమయంలో అల్లూరి సీతారామరాజు సైన్యంలో కొందరు వ్యతిరేకులను లోబరుచుకొని మిరపకాయ్ టపా విషయాన్ని తెలుసుకో గలిగారు. అందులో ముఖ్యమైన విషయం మేజర్ గుడాల్ మన్యప్రాంతంలో ప్రభుత్వ పనులు, నిర్మాణాలు చేసే సమయంలో గిరిజన మహిళలను అత్యాచారం చేసి, తరువాత దారుణంగా వారిని మిరపకాయలతో హింసించేవారని తెలుసుకున్నాడు కలెక్టర్ రూథర్ ఫర్డ్... తమ సేనలు చేసింది తప్పే అయినా తాము ఏమైనా చేసేవారము, గిరిజనులు పడేవారనే అహంకారంతో మరింతగా రెచ్చిపోసాగాడు బ్రిటీషు కలెక్టర్. ఒక రకంగా తమ వేలితో తమ కంటిలోనే అల్లూరి పొడిచిన విధానం కూడా కలెక్టర్ రూథర్ ఫర్డ్ ని చాలా ఎక్కువగానే భయపట్టిందని చెబుతారు. ఆ తరువాత ఏజెన్సీకి ప్రత్యేక కమిషనర్ హోదా కూడా రూథర్ ఫర్డ్ కి కట్టబెట్టింది బ్రిటీషు ప్రభుత్వం. ఆతరువాత అల్లూరి చేసే ప్రతీ తిరుగుబాటు కార్యక్రమానికి ముందు మిరపకాయ్ టపా పంపేవారు దీంతో తెల్లప్రభుత్వంలోని సైన్యం కూడా మిరపకాయ్ టపా అంటే హడలి చచ్చేవారు. కాలక్రమంలో మన్యంపితూరి ఉద్యమం మొత్తం అల్లూరి కంటే ముందుగానే మిరపకాయ్ టపానే బ్రిటీషు సేనలు హెచ్చరించేది. దాడి చేస్తామని చెప్పి మరీ బ్రిటీషు ప్రభుత్వంపై ఎంతో చాకచక్యంగా, విజయవంతంగా దాడి చేయడం బ్రిటీషు ప్రభుత్వానికి, మిలటరీ అధికారులకు అంతు పట్టేది కాదు. అలా మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వానికి కంటినిండా కునుపట్టనీయకుండా తెలుగువాడి పౌరుషాన్ని మిరపకాయ్ టపా రూపంలో పంపి భయపెట్టిన గెరిల్లా యుద్ధ విధ్య యోధులు అల్లూరి సీతారామరాజు. అల్లూరి తెల్లవాడిపై చేసిన తిరుగుబాటు ఒక చరిత్ర అయితే, అయన సంధించిన మిరపకాయ్ మరో చరిత్రగా నిలిచిపోయింది..!