తెలుగు జాతి గర్వించదగిన రోజుని మార్చి ఏమార్చారు.. తెల్లవాడు దొంగ దెబ్బ తీసినా.. వాడే నేటీకి గుర్తుపెట్టుకొని భయపడిన క్షణాన్ని.. భారతీయులంతా గర్వంగా తలచుకునే ఆ రోజుని భావితరాలకు గుర్తులేకుండా చేశారు.. భరతమాత దాశ్య శృంఖలాలను తెంచడం కోసం త్రుణపాయంగా వదిలిన ప్రాణాలకు విలువ లేకుండా చేశారు.. వెరసీ ఆ మహానుబావుడిని వీర చరిత్రను శాస్వతంగా మసకబార్చారు. మీరు చదువుతున్నది అక్షర సత్యం.. గుండెలవిసేటంత బాధకలిగినా.. ధారలా కారుతున్న కన్నీటి ప్రవాహాన్ని ఆపుకొని మరీ రాస్తున్న క్షమాపన చెప్పే మాటలివి.. అల్లూరి చరిత్ర పరిశోధకుడిగా, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా అల్లూరి శ్రీరామరాజు(వాడుకబాషలో అల్లూరి సీతారామరాజు) వీర చరిత్రను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పాల్సిన నేను ఆ మహానుభావుని విషయంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేటలో కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటన రోజున గుర్తుచేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాను.. ఆ ఘటన భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడం కోసం బ్రీటీషు వాడి వెన్నులో చలిపుట్టించేంత పోరాటం చేసిన యోధుడు అల్లూరి శ్రీరామరాజు(సీతారామరాజు).. అంతటి మహానుభావుడికి ఎదరురెళ్లి యుద్దం చేయలేని పిరికి పందలు.. కొయ్యూరు మండలం మంప ఘాట్ వద్ద వద్ద ఒక చెరువులో శరీరానికి తగిలిన గాయాలను కడుక్కుంటున్న సమయంలో.. అల్లూరిని వెనుకనుంచి దొంగ దెబ్బతీశారు చేవలేని..చేతకాని బ్రిటీష్ ముష్కరులు...
ఆఖరి శ్వాస వరకూ భరతమాతకోసం, అమాయక గిరిజనుల కోసం పోరాడి.. తన నెత్తుటి దారతో భరతమాతకు తిలకం దిద్దిన చరిత్ర చారిత్రక నేపథ్యం.. ఆరోజు 07-05-1924 తెల్లవాడిపై విశాఖ మన్యంలో జరిగిన భీకర పోరుకి ఆ రోజు ఆఖరైంది. భారతదేశ చరిత్రలోనే ఇదొక వీరోచిత ఘట్టం. బావి భారత యువత గుర్తుంచుకోదగిన అంశం.. కానీ ఆ చరిత్రను పూర్తిగా తిరగరాసేశారు ప్రభుత్వ అధికారులు.. ఆతప్పును చూసిన ప్రజాప్రతినిధులు కూడా దానిని సరిదిద్దే ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా అభివ్రుద్ది పేరుతో చేసిన తప్పు.. నేడు అల్లూరి సీతారామరాజు వీరోచిత మరణాన్ని, ఆ రోజును జాతి మొత్తం తప్పుగా గుర్తుంచుకోవాల్సి వస్తున్నది. కారణం ఆ రోజుని ఆయన పార్దీవశరీరం ఖననం చేసిన ఏజెన్సీ లక్ష్మీపురం (క్రిష్ణదేవిపేటగా పిలుస్తారు)లోని అల్లూరి థీమ్ పార్కులోని సమాధిపై తప్పుడుగా లిఖించారు. తేది (12-05-24) ఆ మహానుభావుడు పుణ్యభూమిపై వదిలిన ప్రాణం తేదినీ తప్పుగా రాశారనుకుంటే.. ఆ మహాను భావుడి జనన తేదిని కూడా తప్పుగానే అదే సమాధిపై (05-07-1897)గానే రాశారు. వాస్తవానికి అల్లూరి శ్రీరామరాజు జననం 04-07-1897 కాగా, మరణం 07-05-1924)గా నమోదు చేయాల్సి వుంది. 27ఏళ్ల ప్రాయంలో దేశం కోసం తన ప్రాణాన్ని వదిలిన మహా వీరుడికి భారతీయులుగా మనం ఇచ్చే గౌరవం ఇదేనా.. అన్న విషయం తలచుకుంటే నిజంగా తలదించుకునేటంత సిగ్గుగా వుంటుంది. అల్లూరి పార్ధీవ శరీరం కాలి భూడిదైన ఆ పుణ్యప్రదేశాన్ని సందర్శించిన వారందరూ ఆయన జనన, మరణ తేదీలను ఎందుకు తప్పుగా లిఖించారు.. వాటిని ప్రజాప్రతినిధులు సైతం ఎందుకు సరిచేయించలేకపోయారని.. మాటలు కోటలు దాటేలా మాట్లాడే నేతల చేతలు.. అల్లూరి మీద ఉండే గౌరవమంటూ ఓ నాలుగు తిట్లు తిట్టుకొని.. ఆ తప్పుడు తేదీలను చూసి మనసులోనే బాధపడి శోకతప్త హ్రుదాయాలతో వెను తిరుగుతూనే ఉన్నారు..
ఆ పరంపరలోనే 08-08-2021న కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం కేబిట్ మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రిష్ణదేవీపేట సందర్శిస్తున్న వేళ ప్రభుత్వాలు, పాలకులు చేసిన తప్పులను ఆమె సాక్షిగానే ఒక్కసారి గుర్తుచేసే ప్రయత్నం చేసింది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net .. వాస్తవానికి తప్పుని తప్పుగా ఎత్తిచూపడం కూడా తప్పుగానే ఉన్న ఈరోజుల్లో.. ఆ మహానుభావుడి చరిత్రకు చెదలు పడుతుంటే తట్టుకోలేక.. చూసి ఓర్వలేక ఎంతో భాధపడుతూ రాసిన ఈ కధనం చూసైనా పాలకుల్లో మార్పు వస్తుందని మాత్రమే చిన్న ఆశ.. లేదంటే అల్లూరి సమాధుల ప్రాంతాన్ని చూసి కేంద్రమంత్రి ముక్కున వేలేసుకున్నప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు అల్లూరి విషయంలో చూపిన నిర్లక్ష్యం గుర్తుకు వస్తుందేమోనని.. ఆ తరువాతైనా ఆయన జనన, మరణ తేదీలను సరిచేస్తారేమోననే ఎక్కడో చిన్న ఆశతోనే ఆ తప్పుని ఎండగట్టాం.. అల్లూరి వీరోచిత పోరాటం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కేంద్రమంత్రైనా అల్లూరికి విలువనిస్తూ.. ఆయన వైభవాన్ని దేశ స్థాయిలో పెరిగేలా చేస్తారో.. లేదంటే రాష్ట్ర పాలకులు, అధికారులు మాదిరిగానే అల్లూరిని, ఆయన చరిత్రను అలానే వదిలేస్తారో తెలీదు కానీ..
విశాఖజిల్లాకి అల్లూరి పేరుపై ప్రస్థానవ వస్తుందా..
భారతదేశంలో బ్రీటీషు సేనలకు రొమ్ము చూపించి ఒక్కడే ఎదురెళ్లి.. వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన అల్లూరి సీతారామరాజు పేరుని విశాఖజిల్లాకి పెట్టే విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిష్ణదేవీపేట పర్యటన సందర్భంగానైనా మన పాలకులు గుర్తు చేసుకుంటారా.. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నేడైనా ఆమెకు గుర్తు చేస్తారా.. అల్లూరిపై నాటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం పెట్టిన కేసుల చిట్టాను, చేసిన అభియోగాలను ఇప్పటికైగా బయటకు తీయించే ఏర్పాటు చేస్తారా.. అల్లూరి వాస్తవ చరిత్రపై నేటీకీ రాష్ట్రప్రభుత్వం అధ్యయం చేయించకుండా వదిలేసినట్టుగా కేంద్రం కూడా వదిలేస్తుందా.. లేదంటే ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి ఇచ్చినంత గౌరవాన్ని అల్లూరి సీతారామరాజుకి ఇస్తారా.. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి దేశవ్యాప్తం చేస్తారా.. కనీసం బ్రిటీషు సేనల్ని మొత్తం ఒకేక్కడిగా ఎదిరించిన పుణ్యభూమి, వీరభూమి, రచ్చబండ పంచాయతీలకు పుట్టినిల్లు అయిన పాతూరు(నాటి కేడిపేటగా పిలవ బడే నేటి క్రిష్ణదేవీపేట.. వాడుకలో పాతూరు గ్రామం)ని గానీ, అల్లూరి సంచరించిన ప్రదేశాలను గానీ కేంద్ర టూరిజం ప్యాకేజీలో చేర్చుతారా.. ఏంచేస్తారో.. ఎటు చేస్తారో.. అదేదీ కాదనుకుంటే ఎప్పటిలానే కేంద్ర ఆర్ధిక మంత్రి క్రిష్ణదేవిపేట పర్యటనలో నేతలంతా హడావిడీ చేసి మీడియాల్లో ప్రచారానికే వాడుకుంటారో ఆగస్టు 8న జరిగే పర్యటనలో తేలుతుంది. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు అల్లూరిని పెడచెవిన పెట్టినట్టుగానే బీజేపీ ప్రభుత్వం కూడా పర్యటనకే వాడుకుంటుందా..? అలా వాడుకున్నా.. మన్యవీరా మీరు మాత్రం ఎప్పటిలానే మీ వీరోచిత చరిత్రను అర్ధం చేసుకోలేని మా చేతగాని తనాన్ని సమాధుల్లోనే నుంచే చూస్తూ అలానే ఉండి పోండి.. ఎందుకంటే మీరు పుట్టిన భారతదేశంలోనే మేమూ పుట్టి మిమ్మల్నే మరిచిపోయామనే చెడ్డపేరు జీవితాంతం మేమూ మోయాలి కదా..జై అల్లూరి, జై జై అల్లూరి..!