విశాఖ మన్యంలో డోలీమోతలు లేకుండా చేస్తాం..


Ens Balu
3
పాడేరు
2021-11-23 12:09:27

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తో కలిసి  మండలంలోని మూలపేట గ్రామ పంచాయతీ పాలమామిడి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఉదయం 6.30 గంటలకు డౌనూర్  చేరుకుని  బచ్చింత గ్రామం నుంచి కాలినడకన వెళ్లి గెడ్డ దాటి సుమారు నాలుగు  కిలోమీటర్ల దూరం (ఒక ప్రక్క) కొండలపైకి నడిచి మూలపేట పంచాయతీ పాలమామిడి గ్రామాన్ని చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డోలీ మోతల నివారిస్తామని చెప్పారు గ్రామానికి విద్యుత్, తాగునీరు, రహదారి, పాఠశాల భవనం లేదని గిరిజనులు  ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  గ్రావిటీ తాగునీటి పథకం, రహదారి నిర్మాణం పాఠశాల  భవనం నిర్మిస్తామని చెప్పారు. ఆర్వో ఎఫ్ ఆర్  పట్టాలు ఎంత మందికి మంజూరు చేసారని ఆరా తీశారు.  పంచాయతీ లో 400 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశామని సబ్ కలెక్టర్ వివరించారు. డోలీ మోతల గ్రామాల కష్టాలను ఐటీడీఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ వివరించారు. గతొలుత డౌనూర్ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల లో జరిగిన మన బడి నాడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు పరిశీలించారు. వంట పరిశీలించి మెనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత డౌనూర్ గ్రామ సచివాలయం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే వివరించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి, పురుషులు వార్డు, ఫార్మసీలో మందులు, ల్యాబ్ ను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఔషధ మొక్కలు నాటాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ట్రైకార్ ఎం డి ఈ.రవీంద్రబాబు ,గిరిజన సంక్షేమశాఖ డిడి  జి.విజయకుమార్, ఎస్ ఈ  ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.