సచివాలయ ఉద్యోగుల పోరుబాట.. అక్టోబర్ 1 డెడ్ లైన్ ?!


Ens Balu
96
visakhapatnam
2025-09-09 06:06:41

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కడుపు మండింది..ప్రక్క ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు వస్తుంటే..నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్.. నోషనల్ ఇంక్రిమెంట్లు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నోచుకోని ఉద్యోగులు తిరగబడ బోతున్నారు.. తమ న్యాయమైన.. చట్టబద్దమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 1 నుంచే ప్రభుత్వసేవలన్నీ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు..ఉద్యోగం ఒకటి.. విధులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖలవి చేయించుకుంటూనే తమకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోతే ఎలా అంటు తిరగబడబోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఉద్యోగుల నెట్వర్క్ గా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ తమ పనులు ఆపేస్తే.. రాష్ట్రం మొత్తం ప్రజలకు సేవలు నిలిచిపోతాయి..ఒక వేళ ఎస్మా ప్రయోగించినా.. కోర్టుకి వెళితే ప్రభుత్వం చేసిన తప్పులు, కావాలని నిలిపేసిన ప్రయోజనాలు స్పష్టంగా కనపిస్తాయి..ఎలా చూసుకునున్నా ఉద్యోగులే విజయం సాధిస్తారు..ఇది కాస్తా వైఎస్సార్సీపీకి ప్రధాన అస్త్రం కూడా అయిపోతుంది..!

అనుకున్నంతా అయ్యింది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సుమారు 1.28లక్షల ఉద్యోగులు తమ సేవలు అక్టోబరు 1 నుంచి ఆపేయాలని నిర్ణయించుకొని.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక చైర్మన్ బూరాడ మధుబాబు ఆధ్వర్యంలో నోటీసు ఇచ్చారు. అనంతరం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి రావాల్సిన ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే హోం మంత్రి అనిత సచివాలయ మహిళా పోలీసుల అంశాలన్ని అసెంబ్లీలో ప్రస్తావించి తెగ హడావిడీ చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ ప్రస్తావిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఉద్యోగులంతా ఆనంద పడ్డారు. కానీ ఆ హడావిడీ కేవలంల ప్రజలను, ఉద్యోగులను, వ్యతిరేక వైఎస్సార్సీపీని నమ్మించడానికేనని తేలిపోయింది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు ఇచ్చిన అభ్యర్ధనలన్నీ బుట్టదాఖలే అయ్యాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్లస్టర్ వ్యవస్త, రేషలైజేష్ అంటూ జీఓలు జారీ చేసింది. అంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. తాజాగా జీఓ నెంబరు 16 విడుడదల చేసి..అందులో తలా తోకా లేకుండా అంశాలను పొందు పరిచింది. అదేంటంటే.. ప్రమోషన్లు, అడ్జెస్ట్ మెంట్లు, డిప్యూటేషన్లు.. అని చెబుతూ జీఓ జారీ చేసింది. వీరి సమస్యలు పరిష్కరించని కూటమి ప్రభుత్వం.. వీరిని భారీగా ఏర్పడుతున్న ప్రభుత్వశాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా వినియోగించుకోవడానికి కార్యాచరణ సిద్దం చేసింది. రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలు ఉంటే.. 74 ప్రభుత్వశాఖలు మాత్రమే వారి వారి శాఖల పనులు చేసుకుంటారు. 

కానీ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాలి.. ప్రభుత్వ సంక్షేమపథకాలు వీళ్లే ప్రజల వద్దకు చేర్చాలి.. మరి సమస్యలూ.. ప్రయోజనాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్జిస్తే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటారు అంటున్నారని సచివాలయ ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో.. వారు కాస్తా 75 ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. దీనితో డైలమాలో పడ్డ కూటమి ప్రభుత్వం ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించేయడానికి సిద్దమైపోయింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా శాఖల అధిపతులే వారిపై అజమాయిషీ చలాయిస్తారు.. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయానికొస్తే.. వీరు విధులు నిర్వహించే అన్నిశాఖల జిల్లా అధికారులు వీరి మీదికి ఎక్కేస్తుంటారు.. ఇక మున్సిపల్ కార్పోరేషన్లలో అయితే.. ఏకంగా జెడ్సీలు వీరి ఉద్యోగాలనే తీయించేస్తానని బెదిరింపులకు దిగుతారు.. 

ఇలాంటి వేధింపులు తట్టుకొని ఇప్పటి వరకూ పనిచేసిన సచివాలయ ఉద్యోగుగు ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగుర వేశారు. ఇప్పటి వరకూ అజయాయిషీ చలాయించిన అన్ని జిల్లాశాఖల అధికారులు వీరి నోటీసుతో డైలమాలో పడ్డారు. సచివాలయ ఉద్యోగులు ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వడం మానేస్తే.. ప్రభుత్వానికి ఎక్కడలేని చెడ్డ పేరూ వస్తుంది. అంతేకాదు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు అందే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా.. అధికంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఏ సంఘం ఉద్యోగులు..సమ్మెలో పాల్గొంటారు.. మరే సంఘం ఉద్యోగులు సమ్మెలో పాల్గొనరు. అనే అంశం రెండు మూడురోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవశాకం ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారం.. ఇపుడు వైఎస్సార్సీపీ ప్రధాన అస్త్రం కాబోతున్నది.  గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చిన క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆశక్తి కరంగా మారింది..!