వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్ మోహనరెడ్డి మానస పుత్రిక..దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగిచూసిన వ్యవస్థ నేడు రాష్ట్రంలో గొల్లుమంటున్నా..తండ్రి స్థానంలో ఉండి ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన వ్యక్తికి చీమకుట్టినట్టైనా లేదా అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.. గత ప్రభుత్వంలోనే సచివాలయ ఉద్యోగుల విషయలో అన్నీ చక్కగా అమలు చేసి ఉంటే నేడు రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది ఉద్యోగులం రోడ్డు ఎందుకు ఎక్కుతామంటూ మండి పడుతున్నారు. మాట్లాడితే మానస పుత్రిక..అంటూ గత ప్రభుత్వంలో ఊదరగొట్టిన వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇపుడు తీరా ఓడిపోయిన తరువాత కనీసం పట్టించుకోవడమే మానేశారంటూ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఉత్తరాంధ్రాలోని అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని మెడికల్ కాలేజీలను చూడటానికి వస్తున్నవేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసనను,ఆవేదనను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెళ్ళ గక్కుతుండటం చర్చనీయాంశం అవుతున్నది..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్న వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిసన చర్చలను సోషల్ మీడియాలో చేపట్టడం సర్వత్రా ఆశక్తిని రెకెత్తిస్తోంది. 1.30 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోతే రోడ్డెక్కి పోరాడుతుంటే.. కనీసం స్పందించని మానస పుత్రిక తండ్రి.. ఇంకా పూర్తికాని మెడికల్ కాలేజీలే పిపిపి విధానంలో ప్రైవేటు పరం అయిపోయితున్నాయంటూ నెత్తీ నోరూ బాదుకోవడం నిజంగా రాజకీయమనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఇచ్చి ఉంటే నేడు కూటమి ప్రభుత్వంలో రోడ్డెక్కి ఆందోళనకు దిగే పరిస్థితి ఉందాని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఒక ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తప్పుచేస్తే ప్రతిపక్షపార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు అదే ఉద్యోగుల తరపున ఉండి పోరాటం చేస్తుందని.. కానీ వైఎస్సార్సీపీ తన మానస పుత్రికగా చెప్పుకొని.. ఐదేళ్లపాటు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజరాలు ఇవ్వకుండా గడిపేసిన వైఎస్సార్సీపీ నేడుు అదే తప్పుని కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్న తరుణంలో ప్రశ్నించకపోవడం నిజంగా రాజకీయమేనని మండి పడుతున్నారు సచివాలయ ఉద్యోగులు.. అంతేకాకుండా రెండేళ్లకు చేయాల్సిన సర్వీసు రెగ్యలరైజేషన్ రెండేళ్ల తొమ్మినెలల వరకూ చేయలేదని, నాడు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లను కూడా ఇవ్వకపోగా.. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి డోర్ టు డోర్ సర్వేలకోసం తిప్పారని.. నేడు అదే పనులను కూటమి ప్రభుత్వం కూడా చేయిస్తూ వన్ ఎంప్లాయ్ మల్టీ డిపార్ట్ మెంట్ సర్వీసెస్ అన్నచందంగా రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆకుంటుందని గత ప్రభుత్వ విధానాలను కూడా వల్లె వేసుకుంటన్నారు.
వైఎస్ జగన్ అనకాపల్లి వస్తున్న వేళ కూటమి ప్రభుత్వంలోని నాయకులు గత ప్రభుత్వ విధానాల కారణంగానే ఆసుపత్రులు తలలేని మొండెంలా మిగిలిపోయాయని దానిని పిపిపి విధానంలో పూర్తిచేయాలని చూస్తే.. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేస్తే.. ఇటు సచివాలయ ఉద్యోగులు కూడా అసలు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఉద్యోగంతో.. అదీ ఎలాంటి జాబ్ క్యాడర్, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ఐదేళ్లు పనిచేయించుకున్నారని పెద్ద ఎత్తు చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా 1.30 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడి తమ డిమాండ్ల సాధాన కోసం ఉద్యమిస్తుంటే..మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నాడు 1.30 లక్షల కుటుంబాల్లో వైఎస్సార్సీపీ వెలుగులు నింపిందని ప్రచారం చేసుకున్నారని.. మీ చలవతో నేడు అవే కుటుంబాలు రోడ్డెక్కాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అదే సమయంలో ఇతర మీడియా కూడా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం వెనుక కేవలం రాజకీయమే తప్పా మరేవి లేవని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అనకాపల్లి పర్యటన ఖారారైన దగ్గర నుంచి రాష్ట్రంలోని అతి ఎక్కువ గ్రామ, వార్డు సచిలయాలున్న విశాఖజిల్లాలో ఈ తరహా చర్చలు జరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇక్కడ వైఎస్సార్సీపీ అధినేత మానస పుత్రిక ఆందోళన చెందుతుందంటూ ప్రశ్నించడానికి వస్తే..గత ప్రభుత్వం హయాంలో మీరేం చేశారని ప్రశ్నిస్తారనే కారణంతో కూడా వైఎస్సార్సీపీ గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి డిమాండ్ల విషయంలో నేటి వరకూ ఎలంటి స్పందన చేపట్టలేదని స్పష్టమవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఏది ఏమైనా వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ శాఖను కుదించడానికి కూటమి ప్రభుత్వం క్లస్టర్ , రేషనలైజేషన్ తీసుకొచ్చి ఉద్యోగులను ఇతరశాఖలకు తరలించేస్తున్న మానసపుత్రిక తండ్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి మాట్లాడలేదని చెబుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వైఎస్. జగన్, వైఎస్సార్సీపీకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా వరకూ దెబ్బకొట్టారనే కారణం బాధ మనసులో ఉండిపోయే సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కి వివిధ రఖలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చూడాలి అనకపాల్లి పర్యటనలో నైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనపై మానసపుత్రిక కటుంబంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయమై ఏదైనా ప్రకటన చేస్తారా.. లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటన్న ఉద్యోగ వ్యతిరేక విధానాలు.. సచివాలయాలను విచ్ఛన్నం చేస్తున్న అంశాలపై మాట్లాడతారా లేదా అనేది తేలిపోనుంది..?!