గ్రామ సచివాలయ మహిళా పోలీసుల గమ్యం ఎటు..? జీఓనెంబరు 59 పరిస్థితేంటి..?
Ens Balu
2
Tadepalli
2021-12-14 04:17:02
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి చిక్కులూ లేకుండా గడిచిన వీరి విధులకు సరిగ్గా ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయంలోనే అన్ని రకాల అడ్డంకులూ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అదేసమయంలో ప్రభుత్వం కూడా హైకోర్టులో పడిన కేసుతో డోలాయమానంలో పడింది. గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలుగా వున్న వీరిని జీఓనెంబరు 59తో మహిళా పోలీసులుగా మార్చింది పోలీస్ శాఖ. అప్పటి నుంచి కొంత కాలం ఐసిడిఎస్, పోలీస్ 2శాఖల్లోనూ విధులు నిర్వహించిన వీరు జీఓనెంబరు 59తో వీరి బాధ్యతలు, విధులు పోలీసు శాఖకే అత్యధికంగా కేటాయించారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టుని ఏర్పాటుచేయడం ఇష్టంలేని కొందరు పోలీసు సిబ్బంది, మరికొందరు దురుద్దేశ పరులు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్ధేశ్యంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఆ సమయంలో మహిళా పోలీలసును చులకనగా చూస్తూ.. మీరు మా పోలీసులతో సమానం కాదని, మీరు ఎంత కాలంల ఈ పోస్టుల్లో ఉంటారో కూడా చూద్దామనే కామెంట్లు కూడా చేసినట్టు భారీగానే ప్రచారం జరిగింది. మహిళా పోలీసులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసిన విషయాన్ని గమనించి, వీరి నియామకాలు చెల్లవంటూ కోర్టు కెక్కారు. ఇది వాస్తవానికి అయినా..గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం వీరిని నియమించి రెండుళ్లుగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పిస్తూ వస్తుంది. ఏది ఎలా జరిగినా కేసు కోర్టుకి వెళ్లిన తరువాత ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలి.. అలా దాఖలు చేసే సమయంలో మళ్లీ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి జిఓనెంబరు 59ని ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకి తెలియజేసింది. అంతేకాకుండా వీరిని గ్రామసచివాలయాల్లోనే ఉంచి ఏ శాఖ ద్వారా విధులకు వినియోగించాలి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రకటన కూడా చేసింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులంతా తమ ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లిందనే భావనతో నేరుగా రాష్ట్ర పోలీసు ముఖ్య అధికారి డిజీపి గౌతం సవాంగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమను పోలీసుశాఖలోనే ఉంచాలని, యూనిఫారం ఇవ్వాలని, శిక్షణ ఏర్పాటు చేయాలని అర్జీ పెట్టారు. ఆ సమయంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. జీఓ నెంబరు 59ని ఉపసంహ రించుకోలేదని.. మహిళా పోలీసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పడం. వాస్తవానికి కోర్టులో మహిళా పోలీసులను పోలీసుశాఖలోకి విలీనం చేస్తూ చేసిన జిఓ నెంబరు 59ని ఉపసంహరించుకున్నట్టు పోలీస్ శాఖ హైకోర్టుకి తెలియజేసింది. ఇపుడేమో మహిళా పోలీసులు అర్జీ పెట్టిన సమయంలో ఆ జీఓను ఉపసంహచరించుకోలేదని చెప్పడంతో మహిళా పోలీసులంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఇదే గ్రామ, వార్డు మహిళా పోలీసుల్లో కొందరు ఖాకీ డ్రెస్సు వేసుకోవడం ఇష్టం లేని మరో వర్గం వారంతా తమను ఐసీడీఎస్ లో విలీనం చేయాలంటూ అధికారులను సంప్రదించడంతో..అసలు గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసుల పోస్టు అనేది ఉంటుందా..? ఊడుతుందా అనేది క్లారిటీ రాకుండా పోయింది. కానీ డీజీపీ గౌతం సవాంగ్ మాత్రమం తమకు అన్యాయం జరుగుతుందని మహిళా పోలీసులు అర్జీలు పెట్టే సమయంలో నేరుగా వారిని సముదాయిస్తూనే..కోర్టుకు అఫడవిట్లు దాఖలు చేసే సమయంలో జీఓను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసులు రెగ్యులర్ అయ్యే సమయానికి మహిళాపోలీసులందరినీ గాల్లో పెట్టడానికి కావాలనే కొందరు పథకం రచించి ఈ రకమైన కోర్టు కేసుల ద్వారా రెగ్యులర్ చేసే సమయాన్ని పొడిగించాలని ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అయితే ఆ విషయం గ్రామ సచివాలయలయంలోని చాలా మంది మహిళా పోలీసులకు అర్ధం కావడం లేదని, దీనితో పోలీసు ఉన్నతాధికారులను కలిసి అర్జీలు సమర్పించే సమయంలో అధికారులు చేసిన ప్రకటనలు మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఆందోళన రేకిస్తున్నాయనే అంశాన్ని ఇపుడు తెరపైకి తీసుకు వస్తున్నారు. హైకోర్టుకి జీఓనెంబరు 59ను ఉస సంహరించుకుంటున్నట్టు తెలియజేసిన పోలీస్ శాఖ..ఇపుడు మహిళా పోలీసులు నేరుగా వెళ్లి తమ ఉద్యోగాలు ఇక్కడే కొనసాగించాలని కోరిన సమయంలో జీఓనెంబరు 59ని ఉప సంహరించలేదని ప్రకటించడం వెనుక మర్మం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నా.. తరువాత మరింత పటిష్టంగా దానిని రూపొదింస్తారా..? అనే వాదన కూడా తెరపైకి వస్తుంది? ..మూడు రాజధానుల విషయంలో ఇచ్చిన జీఓను వెనక్కి తీసుకొని..మరింత పటిష్టంగా మళ్లీ తిరిగి జీఓను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగా మహిళా పోలీసుల విషయంలోనూ ఆ విధంగా ప్రకటించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి..చూడాలి ఏం జరుగుతుందనేది..!