వారి సర్వీసు రెగ్యులరైజేషన్ కి 6నెలలు ఆగాల్సిందే..


Ens Balu
5
Tadepalli
2021-12-16 02:46:24

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ ఆరునెలలు పొడిగించనున్నారు. ఫలితంగా ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా సర్వీసులో ఆరు నెలలు సీనియారిటీ కోల్పోయి సహచర ఉద్యోగుల దగ్గర జూనియర్ లుగా మారిపోబోతున్నారు. దీనితో ఇపుడు ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా లబో దిబో మంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో ఆరు నెలలు వీరు అదే 15వేల రూపాయల జీతానికే పనిచేయాల్సి వుంటుంది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు అక్టోబరు 2నాటికి క్రమబద్దీకరించాల్సి వుంది. కానీ ప్రభుత్వ ఆ తేదీకి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ చేయలేదు. ఆ నెలలో జిల్లా కలెక్టర్ల ద్వారా సమాచారం సేకరించి ప్రభుత్వశాఖల వారీగా సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారభించింది. ఆ సమయంలోనే అన్నిశాఖల ఉద్యోగులతోపాటు, మహిళా ఉద్యోగుల నుంచి సెలవుల జాబితాలు సేకరించిన సమయంలో ఈ విషయం తేటతెల్లమైంది. సచివాలయాల్లోని అందరు మహిళా ఉద్యోగుల నుంచి ప్రసూతి సెలవులు, మెడికల్ లీవులకు సంబంధించిన సెలవుల జాబితాను శాఖల వారీగా ప్రభుత్వం తీసుకుంది. అలా ప్రసూతి సెలవులు తీసుకున్నవారందరికీ సర్వీసు మరో 6 నెలలు పొడిగింపు వర్తిస్తుందని జిల్లా శాఖల అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం సచివాలయ మహిళా ఉద్యోగుల్లో నెలకొంది.   

అయితే ప్రభుత్వంలోని కొన్నిశాఖల అధికారులు మాత్రం సర్వీసు రెగ్యులరైజేషన్ కి, మెటర్నటీ లీవులకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ దానికి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవని కూడా అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు అన్నిరకాల లీవుల సమాచారం సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా శాఖల అధికారులు సేకరించారు. రెండేళ్లు పూర్తిచేసుకున్నవారి నుంచి సర్వీసు రెగ్యులరైజేషన్ కి సంబంధించి ప్రొఫార్మాను జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆ సమయంలో జిల్లా అధికారులు చేసిన సూచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ మహిళా ఉద్యోగుల గ్రూపులో పెద్ద ఎత్తున చర్చనడుస్తున్నది. రెండేళ్లు సమయం కేవలం 15వేలు జీతానికి పనిచేసిన సచివాలయ మహిళా ఉద్యోగులంతా మరో ఆరు నెలల పాటు అదే జీతానికి పనిచేయడానికి సిద్దంగా లేరనేది ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చల శారాంశం.

పోనీ 6 నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కోసం వేచి వుంటే సహచర ఉద్యోగుల దగ్గర సర్వీసు విషయంలో వీరంతా ఆరు నెలలు జూనియర్లుగా మారిపోతారు. అంతేకాకుండా ప్రమోషన్ సమయంలో వీరికి ఆరునెలల సమయం వలన చాలా ప్రయోజనాలు కోల్పోపోయే ప్రమాదం వుంది. ఈ తరుణంలో ప్రభుత్వం పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు మేలు చేసినట్టే, ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఏదైనా తీపి కబురు చెబుతుందాని అంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీఎన్జీఓ నేతలు కూడా సచివాలయ ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి వీరికి సర్వీసు రెగ్యులరైజేషన్ సమయానికి పూర్తయితే పర్వాలేదని, లేదంటే  ఈ విషయంలో కోర్టుకెళ్లడమే ఉత్తమంగా సచివాలయ మహిళా ఉద్యోగులంతా భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.  ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరుకి ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఒక క్లారిటీకి రావాలని ఉద్యోగులంతా భావిస్తున్నారని సమాచారం. 

అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆది నుంచి సమస్యలపైనా, అభివ్రుద్ధి కార్యక్రమాలపైనా, ప్రభుత్వ శాఖల అధికారుల తేడా వ్యవహారాలపై అక్షర సమరం చేస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ న్యూస్ యాప్ enslive, అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లతో ఇప్పటికే ఈ సమస్య నుంచి మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో ఒక మంచి మార్గం చూపించడానికి రంగంలోకి దిగింది. దీనికోసం అంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నిబందనలపై అధ్యయనం చేస్తున్నది. అంతేకాకుండా ఇలాంటి సమస్య వచ్చినపుడు గతంలో కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టుకి వెళ్లినపుడు వచ్చిన తీర్పులను కూడా న్యూఢిల్లీ నుంచి తెప్పించే పనిలో పడింది ఈఎన్ఎస్. అంతేకాకుండా మహిళా ఉద్యోగలకు జఠిలంగా మారిన ఈ సమస్యను పరిష్కరించడంలోనూ, ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకెళ్లడంలోనూ ప్రత్యేక ద్రుష్టిసారించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా, వారి పక్షాన ఈఎన్ఎస్ అండగా నిలబడుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. తల్లికావడమే సచివాలయ ఉద్యోగులు చేసిన పాపంగా ఇపుడు వారి సర్వీసు రెగ్యులైజేషన్ మరో ఆరు నెలలు వెనక్కి వెళితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అదైర్య పడకండి సచివాలయ ఉద్యోగుల్లో తల్లులుగా మారి సర్వీసు రెగ్యులైజేషన్ ఆరనెలలు పొడిగింపడిన వారి పక్షాన నిలిచి న్యాయం జరిగేలా ఈఎన్ఎస్ వంతు క్రుషిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం..