గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఎప్పుడు.. పేస్కేలు అమలయ్యేనా..


Ens Balu
13
Tadepalli
2021-12-21 05:07:16

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ శాఖ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శాఖ విశేషాలు తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూసి శభాష్ అంటూ మెచ్చుకుంది.. ఇంత వరకూ బాగానే వున్నా.. ఇందులో పనిచేస్తున్న సుమారు లక్షా 30వేల మంది ఉద్యోగుల్లో కొంత మందికి మొన్న అక్టోబరు2తో రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.  అలా ప్రొబేషన్ పీరీయడ్ పూర్తియన మొత్తం ఉద్యోగులందరికీ సర్వీసు రెగ్యులర్ చేసి పేస్కేలు అమలు చేయాలి. కాని సర్వీసు ప్రొబేషన్ పూర్తయి 3 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వశాఖల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. వాస్తవానికి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగుల నుంచి అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు అక్టోబరు 2నాటికే సర్వీసు ప్రొబేషన్ తంతు ముగించి నంబరు 2 న ఇచ్చే జీతాలు పేస్కేలుతో కలిపి ఇవ్వాల్సి వుంది. ఆవిధంగా జరగకపోవడమే ఇపుడు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం అవుతుంది. 

 సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఇదే జీతాలు ఇస్తారని కొందరు, కాదు కాదు మరో ఐదువేలు కలిపి 20వేల రూపాయలు ఇస్తారని కొందరు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఈ తరుణంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఉద్యోగుల్లో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందం అయితే ఉంది తప్పితే తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా, పేస్కేలు అమలు చేస్తారా, రెండేళ్లు పూర్తయినా ఇంకా ఎందుకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసు రెగ్యులర్ ఎందుకు చేయలేదనే అనుమానాలు ఉద్యోగులను వెంటాడుతూనే ఉన్నాయి.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ శాఖను అయితే ఏర్పాటు చేసింది తప్పితే ఇందులో పనిచేసే సుమారు 14శాఖల ఉద్యోగులకు మాత్రం వారి విధులు, నిధులు, పరిధిలు మాత్రం రెండేళ్లు దాటిపోతున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది ..కాదు కాదు కావాలనే కొన్ని ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు ఈ విధంగా వ్యవహరించి ఉద్యోగుల్లోని ఆందోళనకు, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అన్నింటికంటే ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టిన దానికి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగిస్తారనే మాట ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఇదే జరిగితే అలా ప్రసూతి సెలువులు తీసుకున్నమహి ళా ఉద్యోగులు సహచర ఉద్యోగుల దగ్గర ఆరు నెలలు సర్వీసులో జూనియర్ గా మారిపోవడంతోపాటు, పదోన్నతులు కూడా కోల్పోయే ప్రమాదం వుంది.  ఈ విషయంలో ప్రభుత్వంలోని జిఏడీ ప్రకటన చేయాల్సి వున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ప్రసూతి సెలవులు తీసుకున్న ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఆరు నెలల గడువు పొడిగిస్తారనే భావను ఉద్యోగులు వచ్చేస్తున్నారు. కాగా కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రసూతి సెలవులకు, సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధం లేదని అధికారులు తెగేసి చెబుతున్న ప్రకటనలు కూడా సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీసు రూల్సు ఏం చెబుతున్నాయనే విషయంలో ప్రభుత్వ అధికారులకు సైతం క్లారిటీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు సబార్టినేట్ సర్వీసు రూల్స్ 16హెచ్ విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ అంశం ఇపుడు మళ్లీ తెరపైకి వస్తుంది.

కాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లో సాధారణ పనిదినాలు కంటే అత్యధికంగా 2వ శనివారాలు, ఆదివారాలతోపాటు అదనపు పనిగంటకు కూడా పనిచేసి రోజులున్నాయి. ఇవన్నీ ప్రభుత్వంలోని సర్వీసు రూల్సు నిబంధనలోని కావు. అయినా..అదనపు పనులు చేయించుకున్న ప్రభుత్వ శాఖల అధికారులు నిబంధనలు అమలు, ఇచ్చిన జీఓలు తమ విషయంలో ఎందుకు పాటించి అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు ‘ఆ ఒక్కటీ అడక్కు’అనే సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు అహర్నిసలు సేవలు చేసినా..కరోనా కాటు బలైన ఉద్యోగులున్నా.. చాలామంది సచివాలయ ఉద్యోగులు నేటికీ కరోనా వ్యాధి భారిన పడుతున్నా ప్రభుత్వంలోని, ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలకు మాత్రం ఏమీ పట్టడటం లేదు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని నిబంధనలు, అదనపు పనిదినాలు, పనిగంటలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే చూస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసు రెగ్యులైజేషన్ కావడం ఆలస్యం కావడం పట్ల సచివాలయ ఉద్యోగుల్లో భయం నెలకొంది. వాస్తవానికి ఆ భయాన్ని ప్రభుత్వమే పోగొట్టాల్సి వున్నా నేటికీ సరైన ప్రకటన చేయకపోవడం విశేషం. ప్రభుత్వ నిబంధన ప్రకారం సర్వీసు రెగ్యులైజేషన్ కాస్త ఆలస్యంగా చేసినా.. ప్రభుత్వం ఉద్యోగ నియామక సమయంలో ఇచ్చిన నిబంధనల ఆధారంగా ఏ రోజుకైతే రెండేళ్ల సర్వీసు పూర్తయ్యిందో ఆ తేదీ నుంచి పేస్కేలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు, జీతం అమలు చేస్తారా లేదా అనేది కూడా ఇపుడు సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందో..!