రెండేళ్లు దాటిపోతున్నా అమలు కాని జీఓ-149..


Ens Balu
5
Tadepalli
2022-01-01 05:19:38

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల ప్రొబేషన్ రెండేళ్లు దాటిపోతున్నా జీఓనెంబరు 149 ఆధారంగా సంక్రమించాల్సిన అధికారాలు, విధులు, నిధులు మాత్రం పంచాయతీరాజ్ శాఖ వీరికి అమలు చేయలేదు. దీనితో రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు ఎలాంటి అధికారాలు లేని ఉత్సవ విగ్రహాల్లా కనీసం సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుంది. జీఓ నెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు వారు పనిచేసే సచివాలయ పరిధిని మొత్తం వీరికి అప్పగించాలసి వుంటుంది. దానికోసం మేజర్ పంచాయతీని విభజించి అందులోని నిధులను, విధులను, అధికారాలను కూడా బదలాయించాలి కానీ..ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలు ఏర్పాటై 26 నెలలు గడుస్తున్నా వీరికి మాత్రం ఆ అధికారాలను ప్రభుత్వం బదలాయించలేదు. దీనితో అధికారాలు ఇవ్వని జీఓలు ఎందుకు విడుదల చేయాలంటూ గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వం మరియు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ వ్యవహరా శైలిపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలందించాలని సచివాలయ కార్యదర్శిలు ఉద్యోగాల్లోకి చేరినా నాటి నుంచి నేటి వరకూ ప్రభుత్వం జీఓనెంబరు 149 ద్వారా చట్టబద్ధంగా తమకు రావాల్సిన అధికారాలను బదలాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం  రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు ఆరు వేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓల దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం నేటికీ ఫలితం లేకుండా పోయింది. తమకు అధికారాలు లేకపోవడం వలన ఆఖరుకి పారిశుధ్య నిర్వహణ కూడా సొంతంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎందుకు విధులు నిర్వహిస్తున్నామో తమకే తెలియడం లేదంటూ నిరసన తెలియజేస్తున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటి మరో మూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో అయినా ప్రభుత్వం గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, తమ సచివాలయ పరిధిని లెక్కల ప్రకారం విభజిస్తుందా లేదంటే ఇప్పటివరకూ ఎలాంటి అధికారమూ ఇవ్వకుండా పనిచేయించినట్టుగా వారితో విధులు నిర్వర్తించేలా చేస్తుందా అనేది తేలాల్సి వుంది..