జిఓనెం-2లో ఈఎన్ఎస్ చెప్పిందే అక్షర సత్యమైంది.. ప్రభుత్వమే ఆ జీఓను వెనక్కి తీసుకుంది..!


Ens Balu
10
Tadepalli
2022-01-05 05:17:14

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలకు అధికారాలిస్తూ విడుదల చేసిన జీఓనెంబరు-2 విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పినట్టే జరిగింది. ప్రభుత్వం ఈ జీఓను వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. జీఓనెంబరు-2 విడుదలచేసి సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమించినపుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. ఈ జీఓ విడుదల విషయంలో వచ్చిన ఇబ్బందులు, ఆ తరువాత సాంకేతిక కారణాలు చాలా మందికి వీఆర్వోలకు కనీసం డిగ్రీ అర్హత లేకపోవడం, పరిపాలనపై పట్టులేకపోవడం, పంచాయతీల్లో సిబ్బంది వీఆర్వోలను డిడిఓలుగా అంగీకరించకపోవడం తదితర పరిణామాలపై ప్రత్యేక కధనాలు అందించింది. ఆ తరువాత సర్పంచ్ లు, కార్యదర్శిలు ఈవిషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గ్రామ పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని. దీనితో కంగారు పడిన పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామసచివాలయ వ్యవస్థకే ముసలం వస్తుందని భావించిన ప్రభుత్వం ఆ తరువాత వెంటనే జీఓని రద్దు చేయకుండా మళ్లీ డీడీఓ అధికారాలు పంచాయతీలు, సచివాలయ కార్యదర్శిలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మెమో జారీ చేశారు. ఈ విషయంలో కోర్టుకి వెళ్లిన పంచాయతీ సర్పంచ్ లు తమ వాదన బలంగా వినిపించడంతో గత్యంతరం లేక ప్రభుత్వం జీఓనెంబరు 2ను ఇపుడు వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి తెలియజేసింది.

 ప్రభుత్వ పరిపాలన, జీఓలు అమలు, లోపాలు, సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, ముఖ్యం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ  విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యేక కధనాలు అందిస్తూ వచ్చింది. ఇకపై కూడా అందిస్తూనే వుంటుంది కూడా. అయితే అప్పుడు వాస్తవాలను ముందే గమనించి రాసిన సమయంలో ఈఎన్ఎస్ కధనాలను రాష్ట్ర వ్యాప్తంగా వున్న చాలా వీఆర్వోలు కొట్టిపడేశారు..ప్రభుత్వమే ఇపుడు ఆ జీఓను వెనక్కితీసుకుంటుందని హైకోర్టుకి తెలియజేయడంతో ఎవరైతే కామెంట్లు, ఓవరేక్షన్ చేశారో వారంతా ఇపుడు ముక్కున వేలుసుకున్నారు. ఈఎన్ఎస్ ప్రభుత్వ పరిపాలన విషయంలో అందించే పరిశోధనాత్మక కధనాలు, వాస్తవాలు జీఓనెంబరు 2 విషయంలో కూడా వొమ్ముకాలేదని, తన కధనాల్లో ఏవైతే విషయాలు ప్రస్తావిస్తూ ప్రచురించిందో అదేవిధంగా.. జీఓనెంబరు రద్దుకాక పోతే పాలనా పరమైన ఇబ్బందులు, కోర్టుల్లో ఇబ్బందులు తప్పవనే విషయాలు ఇపుడు తేటతెల్లమయ్యాయని ఎవరైతే కామెంట్లు చేసి..లైట్ తీసుకున్నారో వారందరికీ ఈఎన్ఎస్ కధనాలు కళ్లు తెరిపించాయి.

వాస్తవానికి గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో అధిపతిగా వున్న పంచాయతీ, సచివాలయ కార్యదర్శిలకే డిడిఓ అధికారాలుండాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పంచాయతీ కార్యదర్శిలే మొత్తం సచివాలయాలను, పంచాయతీలను పరిపాలిస్తుంటారు. అలాంటిది వారికి కాకుండా సిబ్బందిలో ఒకరైన వీఆర్వోకి డిడిఓ అధికారాలు కట్టబెట్టడం అనేది అవివేక చర్యగానే ఇపుడు తేలిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో రెండు, మూడు గ్రామ సచివాయలయాలు ఉన్నచోట కూడా పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు డిడిఓ అధికారాలు, జీఓనెంబరు-149ని అమలు చేసి అధికారాలు కట్టబెడితే ప్రభుత్వం అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149 విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకపోతే..గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలు వారి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత మళ్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే జీఓనెంబరు 2 విషయంలో ఏం జరిగిందో అపుడు కూడా తప్పని సరిగ్గా జిఓనెంబరు149ని కూడా అమలు చేయాల్సి వుంటుంది. అలాకాకుండా ముందుగానే అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి మద్దతు రావడంతోపాటు గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడానికి ఆస్కారం వుంటుంది..