ఆంధ్రప్రదేశ్ తో ఉద్యోగ సంఘాలు చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల జేఏసి చర్చలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిరువురూ మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నారు. మంచి వాతవారణంలో చర్చలు ముగిసినట్టు వారు పేర్కొన్నారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి తలపెట్టి సమ్మెను విరమించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లకు కాస్త మార్పులతో మంత్రుల కమిటీ పచ్చజెండా ఊపింది. దానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా ఆమోద ముద్ర వేయడంతో రేపు జరగబోయే సమ్మకు తెరగినట్టు అయ్యింది..