సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
Ens Balu
2
Tirumala
2020-09-16 18:58:13
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. స్వామివారికి నిర్వహించే వాహనసేవల వివరాలను టిటిడి ప్రకటించింది...వాటి ప్రకారం 18.09.2020 - శుక్రవారం - అంకురార్పణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, 19.09.2020 - శనివారం - ధ్వజారోహణం (మీనలగ్నం) - సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల వరకు, పెద్దశేష వాహనం - రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు, 20.09.2020 - ఆదివారం - చిన్నశేష వాహనం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, స్నపన తిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు, హంస వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 21.09.2020 - సోమవారం - సింహ వాహనం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు, ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 22.09.2020 - మంగళవారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు, సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 23.09.2020 - బుధవారం - మోహినీ అవతారం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, గరుడసేవ - రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు, 24.09.2020 - గురువారం - హనుమంత వాహనం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, సర్వభూపాల వాహనం - సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, గజ వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 25.09.2020 - శుక్రవారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు, చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 26.09.2020 - శనివారం - సర్వభూపాల వాహనం- ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు, 27.09.2020 - ఆదివారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 4 నుండి 6 గంటల వరకు, స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 6 నుండి 9 గంటల వరకు(అయిన మహల్‌లో), ధ్వజావరోహణం - రాత్రి 8 నుండి 9 గంటల వరకూ నిర్వహిస్తారు...