సీఎం వైఎస్.జగన్ కి అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు..


Ens Balu
4
Tadepalli
2022-03-10 15:24:09

స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడంతో  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో సీఎం  వైయస్‌.జగన్‌ మోహనరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ విషయాన్ని కాకినాడలోని మీడియాకి తన చరవాణి ద్వారా ప్రకటన జారీ చేశారు. గురువారం సహచర మంత్రులతో కలిసి వెళ్లిన మంత్రి కురసాల స్కోచ్ అవార్డుల్లో వ్యవసాయ రంగానికి తొలి స్థానం రావడంపైనా హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందుచూపుతోనే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతం చేసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే రైతుభరోసా కేంద్రాలు గ్రామసచివాలయాలకు అనుసంధానంగా ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తున్నారని మంత్రి తెలియజేశారు. సీఎంని కలిసిన వారిలో మంత్రికురసాలతోపాటు మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్‌ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.