ఏపీ కొత్త జిల్లాల్లోనూ సమాచారశాఖ కష్టాలు..


Ens Balu
4
Tadepalli
2022-04-06 11:18:43

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో ప్రభుత్వ శాఖల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు.. పాపం కష్టాలన్నీ సమాచారశాఖకే వచ్చాయి. అసలే సిబ్బందిలేమితో సతమతం అవుతున్న సమాచారశాఖలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని కొత్త జిల్లాలకు ప్రభుత్వ శాఖల నుంచి జిల్లాస్థాయి అధికారులను కొత్త జిల్లాల్లో అధికారులను నియమిస్తే ఇక్కడ మాత్రం డివిజనల్ స్థాయి అధికారులను నియమించాల్సి వచ్చింది.. అదీ ఒక్కొక్కరినే. సమాచారశాఖలో గత మూడు ప్రభుత్వాల నుంచి కొత్త నియామకాలు చేపట్టడం లేదు. దానికి కారణం ఒక్కోప్రభుత్వంలో ఒక్కరోజకీయపార్టీకి ప్రధాన మీడియా సంస్థలు ఉండటంతో ప్రభుత్వాలకు కూడా పెద్దగా సమాచారశాఖలో పనిలేకుండా పోయినట్టు అయిపోయింది. ఒక్కో ప్రభుత్వం దైర్యం చేసి ఏపీఆర్వోలను నియమించినప్పటికీ వారంతా ఈ శాఖకు కొత్తవారు కావడంతో ఉన్నా లేనట్టుగానే వుంది. దీనితో సమాచారశాఖలోని అధికారులు, సిబ్బంది కష్టాలు అన్నీ ఇన్నీ కావు అన్నట్టుగా తయారైంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తొలుత సమాచారశాఖలో ఉద్యోగాలను భర్తీచేసిన తరువాతే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేస్తాయి ప్రభుత్వాలు. కానీ విచిత్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రభుత్వాలు మాత్రం అసలు సమాచారశాఖ అనే ఒక ప్రభుత్వ శాఖ ఉందనే విషయాన్నే మరిచిపోయిన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా..మంత్రులకు పీఆర్వోలను నియమించే ప్రభుత్వాలు..పూర్తిస్థాయిలో రెగ్యులర్ సిబ్బందిని మాత్రం ఈ శాఖలో నియమించడం లేదు. అలాగని కాంట్రాక్టు విధానంలో కూడా ఖాళీలను భర్తీ చేయడంలేదు. నాల్గవ తరగతి ఉద్యోగాలను మాత్రం కారుణ్యనియమాకాల కింద నియమిస్తున్నారు తప్పితే ప్రత్యేకంగా ఈ శాఖకంటూ ఉద్యోగులను ఏపీలో నియమించే పనిమాత్రం పెట్టుకోవడం లేదు. ఒక కరంగా ఇది కావాలని చేస్తున్నా.. దాని ప్రభావం పత్రికలు, మీడియాపై చాలా పడుతోంది. ప్రభుత్వ సమాచారం మొత్తం సమాచారశాఖలోని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి, సహాయ పౌరసంబంధాల శాఖ అధికారి ఇవ్వాల్సి వుంది. సిబ్బంది లేమితో ఉన్న ఒకటి అరా సిబ్బంది జిల్లా కలెక్టరేట్లతే పరిమితం అయిపోతున్నారు. ఈ క్రమంలో పత్రికలకు మీడియాకి సమాచారం అందడం లేదు. అదేమంటే ఉన్నంత వరకూ మాత్రమే పనిచేయగలనిమ, లేని సిబ్బందితో ఎక్కడ జిల్లా సమాచారం మొత్తం అందించగలమని అంటున్నారు సమాచారశాఖ అధికారులు. కనీసం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనైనా కొత్త జిల్లాలకు డిపీఆర్వోలను, డివిజన్ కేంద్రాల్లో డివిజనల్ పీఆర్వోలనైనా ప్రభుత్వం నియమిస్తుందా అదీలేకుండా పొయింది. మా శాఖ కోసం ప్రభుత్వాలు ఆలోచించాలని ఇందులోని అధికారులు నెత్తీనోరూ కొట్టుకున్న ఫలితం లేకుండాపోయింది. విచిత్రం ఏంటంటే ఈ శాఖకకు చెందిన మంత్రులే ఈ శాఖకోసం పట్టించుకోకుండా వ్యవహారం చేయడం విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం 13 జిల్లాలు26 జిల్లాలుగా మారానా... రేపో మాపో మరో జిల్లా పెరిగి 27 జిల్లాలు అయినా ఈశాఖలో మాత్రం జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో లేరు...రారు.. వచ్చే పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. అలాగని కాంట్రాక్టు పద్దతిలో అయినా సిబ్బందిని నియమించారా అదీలేదు. ఇన్ని ఇబ్బందులు మద్య ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు ఒక్కొక్కరినీ పంపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమాచారశాఖపై ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ పథకాలు, సమాచారం మీడియా, పత్రికలకు అందే అవకాశం కనిపిస్తుంది లేదంటే అవే కష్టాలు కొత్త జిల్లాల్లోనూ ఉత్పన్నం కావడం తధ్యంగానే కనిపిస్తోంది.