ఏపీలో నూతన జిల్లాల విభజన గోరంత.. చేయాల్సిన పనులు కొండంత..
Ens Balu
8
Amaravati
2022-04-07 08:00:10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఉగాదినాటికి మార్చి గోరంత పనిని చేసి..ఆపై కొండంత పనిని అధికారుల బుజాలపై వేసింది. ఉగాది తరువాత నుంచి పరిపాలన సాగుతుందని చెప్పిన ప్రభుత్వం కొత్త జిల్లాల్లో కలెక్టర్లలో పాలన మొదలు పెట్టింది. జిల్లాల విభజన అధికారికంగా జరిగినా..అక్కడ జరగాల్సిన పరిధిలు, అధికారులు, సిబ్బంది బదిలీలు పూర్తిస్థాయి జాబితా మాత్రం చాంతాడంతుంది. చాలా ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి ఉద్యోగులు లేరు. సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. కాకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న పాలసీని అనుసరించి ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా అయితే మార్చిచూపించింది. ఇప్పటి వరకూ పాత జిల్లాల పేర్లతోనే అందరికీ అలవాటైన పేర్లను ఇప్పటికిప్పుడు కొత్తపేర్లతో పిలవడం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ.. పిలవక తప్పని పరిస్థితి. ప్రజల పరిస్థితే ఇలా వుంటే మొన్నటి వరకూ ఒకే జిల్లాలో వున్న అధికారులు ఇపుడు వారంతా రెండు జిల్లాలకు, మూడు జిల్లాలకు కొత్త అధికారులుగా మారిపోవడంతో వారి జిల్లాల్లోకి వచ్చే నియోజకవర్గాలు, మండలాలు, ప్రాంతాలు, సరిహద్దులు లెక్కలు వేసేకునేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుంది అంటున్నారు అధికారులు. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగానూ, జెసీలుగా ఉన్నవారు ప్రధాన పరిలాన చేస్తున్నప్పటికీ, కింది స్థాయి అధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది విభజన తరువాత చేయాల్సిన పనులను ప్రభుత్వం ఇచ్చిన వివిధ ఫార్మాట్ల రూపంలో మళ్లీ ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లలో చాలా బిజీగా నిమగ్నమై వున్నారు. ఇప్పటికే 13 జిల్లాలుగా వున్నవన్నీ 26 జిల్లాలుగా మారడంతో ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా అధికారిక వెబ్ సైట్లు రెడీ అవుతున్నాయి. కొన్నింటికి ఇంకా అధికారుల జాబితాల, ప్రకభుత్వ శాఖల వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత సాధారణ పద్దతిలోనే అధికారులు, ఇతర కార్యాలయ సిబ్బంది ఉంటారని అనుకున్నారు ఉద్యోగులంతా. సిబ్బంది చాలాకపోతే కొత్తవారిని నియమిస్తారని అంతా ఊహించారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వ పరిపాలన మొత్తమే మర్చేసింది ప్రభుత్వం. ఇకపై గతంలోమాదిరిగా 75 ప్రభుత్వశాఖల కార్యాలయాల్లో ఉండేవిధంగా సిబ్బంది ఉండరు. వారందరినీ కుదించి పనుల భారం మొత్తం కుదించిన ఆ సిబ్బంది, అధికారులనే పైనే వేయనుంది. ఇప్పటికే 13 కొత్త జిల్లాలకు అధికారులు, సిబ్బంది తరలి వెళ్లిపోవడంతో ఇప్పటి వరకూ జిల్లా కేంద్రాల్లో పనిచేసిన అధికారులు సిబ్బంది చాలక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నూతన విధానాలకు అనుగుణంగా సమాచారం అడుగుతుండటంతో సిబ్బంది లేమితో కొట్టి మిట్టాడుతున్న జిల్లా అధికారులంతా సమాచారం ఇచ్చే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్న మయ్యారు. దీనితో విభజన పని గోరంత మాత్రమే అయినా..ఆ తరువాత మిగిలివున్న పని కొండంత వున్నదని..ఆ భారం మొత్తం తాము మోయాల్సి వస్తుందని అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు పెద్ద స్థాయిలో వారి వారి సామాజిక మాద్యమాలు, టెలీఫోన్లలో చర్చకు తెరలేపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాత జిల్లాలతోపాటు, కొత్త జిల్లాల్లోనూ ఇదే హాట్ టాపిక్..అయితే కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తరుణంలో ఎక్కడైనా ఇదే తరహా పనులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ సిబ్బంది కొరత వుండటంతో కొత్త ఫార్మాట్ ల పనిభారం జిల్లా అధికారులపై చాలా ఎక్కువగా పడుతుండటం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ పరిస్థితి సుమారు ఆరునెలల పాటు కొనసాగే అవకాశం వుంటుందని అటు ప్రభుత్వ వర్గాల్లోని ముఖ్యశాఖల అధికారులు సైతం చెప్పడం విశేషం..!