జిల్లాల విభజనతో అవినీతికి అడ్డుకట్ట..


Ens Balu
5
Tadepalli
2022-04-08 03:38:46

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం జిల్లాల విభజనతో ప్రభుత్వ శాఖలో పేరుకు పోయిన అవినీతికి అడ్డుకట్టపడినట్టైంది. లేదంటే రాష్ట్రంలో ఒక్కో జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లోని జిల్లా అధికారుల నుంచి మినిస్టీరియల్ స్టాఫ్ వరకూ వివిధ పనులపై జిల్లా కార్యాలయాలకు పనులపై వెళ్లే ఆయా ప్రభుత్వ సిబ్బంది నుంచే దండిగా లంచాలు మేసేవారు. అంతేకాకుండా పెద్దజిల్లాల్లో జిల్లా అధికారులుగా పోస్టింగులకోసం తహ తహ లాడేవారు. అలాంటిది జిల్లాల విభజన తరువాత వారి అవినీతి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్టు అయ్యింది. అంతేకాకుండా జిల్లా కార్యాలయాల్లోనూ అధికారులను, సిబ్బందిని కుదించడంతో పరిపాలన మరింత సత్వరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాశాఖల అధికారుల వద్ద ఏ సమస్య అయినా చాలా వరకూ పెండిగింగ్ లో వుండేది. అర్జీ పెట్టిన తరువాత ఎప్పుడు పరిష్కారం అవుతుందో అసలు గ్యారంటీ ఉండేది కాదు. ఇపుడు ఏపీలోని 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మారడం రెవిన్యూ డివిజన్ల సంఖ్య కూడా పెరగడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటికే జిల్లాల విభజన విజయవంతంగా పూర్తికావడంతో ఇపుడు జిల్లాల్లోని 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల నియామకాల జరుగుతున్నాయి. కొన్నిజిల్లాల్లో అధికారులు తక్కువగా ఉండటంతో  ఉన్న జిల్లా అధికారులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా ప్రధాన శాఖలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీ రాజ్ తదితర శాఖల్లో జిల్లా అధికారుల నియామకాలు పూర్తికాలేదు. అవినీతి వ్యవహారాలు కూడా ఈ శాఖల్లోనే అధికంగా వుండటంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాపం చాలా మంది జిల్లాశాఖల అధికారులకు  మింగుడు పడనీయడం లేదు. ఒకప్పుడుు జిల్లాల విస్తీర్ణం, పరిధి, మండలాలు పెద్దవిగా ఉండటంతో జిల్లా అధికారులు సైతం అభివ్రుద్ధిపైనా, సమస్యలపైనా పెద్దగా ద్రుష్టిసారించేవారు కాదు. కానీ ఇపుడు జిల్లాల విభజన జరిగిన తరువాత జిల్లా కలెక్టర్ల నుంచి అన్ని శాఖల అధికారులకు పరిధిలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనితో అన్నిప్రాంతాలు అభివ్రుద్ధితోపాటు, సమస్యల పరిష్కారం, పరిపాలన కూడా ఇక చాలా తేలక అవుతుంది. నేడో రేపో కొత్తగా ప్రకటించిన గ్రూప్1, 2 ఉద్యోగ ప్రకటనల ద్వారా మరో 250కి పైగా ఉద్యోగాలు భర్తీతో ఖాళీగా ఉన్న జిల్లాశాఖలు, డివిజన్ శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ కానున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ జిల్లాల విభజనతో ప్రజలకు మెరుగైన పాలన పూర్తిస్థాయిలో అందనుంది. అయితే విభజన అధికారుల కేటాయింపు ఇప్పుడిప్పుడే జరగడంతో మొత్తం వ్యవహారం పూర్తిస్థాయిలో అమలు కావడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మెరుగైన పరిపాలన ఏ స్థాయిలో ప్రజలకు అందుతుందనేది.