తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 9న అఖండ విష్ణుసహస్రనామ పారాయణం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం ఏప్రిల్ 9న ముగియనుంది. కాగా, అదే రోజు తిరుమలలో టిటిడి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నాద నీరాజన వేదికపై సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కుప్పా నరసింహంతో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని టిటిడి ఎస్వీబీసీ ఛానల్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు వారి వారి ఇళ్లల్లో ఉండి కూడా ఈ అఖండ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొనాలని టిటిడి భక్తులను కోరుతోంది.