రామయ్య బ్రహ్మోత్సవాలకు రండి..


Ens Balu
5
Tadepalli
2022-04-08 15:14:37

ఒంటిమిట్టలో  ఏప్రిల్ 9 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించే  శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సిఎం కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. డిప్యూటి ఈవో  రమణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.