తిరుమలలో మరో దాత‌ల కౌంట‌ర్..


Ens Balu
2
Tirumala
2022-04-20 09:45:17

తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బుధవారం దాత‌ల కోసం మరో కౌంట‌ర్‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ చేశారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది.  దాత‌లు చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు స‌మ‌ర్పించేందుకు వీలుగా యూనియ‌న్ బ్యాంక్ సౌజ‌న్యంతో ఈ కౌంట‌ర్ ఏర్పాటు చేశారు. భ‌క్తులు రూ.100/- నుండి విరాళాలు అందించ‌వ‌చ్చు.  ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ప్రత్యేకాధికారి  జిఎల్ఎన్‌.శాస్త్రి, యూనియ‌న్ బ్యాంకు రీజనల్ మేనేజర్  శాస్త్రి, బ్రాంచి మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.