కొత్త జిల్లాలకు సరికొత్త యూనివర్శిటీలు..


Ens Balu
4
Tadepalli
2022-04-21 02:18:59

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలను చేయడంతోపాటు, ఆయా కొత్తజిల్లాలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్టం చేయడానికి జిల్లా ప్రాధాన్యతను బట్టి ఆ జిల్లాలో సంబంధిత యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటి వచ్చింది.  అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఆయ ఉత్తమ విద్యావిభాగాలకు చెందిన యూనివర్శిటీలను కొత్తజిల్లాల్లో ఏర్పాటు చేసి జిల్లాలను విద్యా కేంద్రాలుగా అభివ్రుద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. దానికితోడు అన్ని కొత్త జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తుండటంతో విద్య, వైద్యం, ఆరోగ్యం పరంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రులను అభివ్రుద్ధి కూడా చేస్తారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.  మెడికల్ కాలేజీతోపాటు, డిప్లమా నర్శింగ్, డిగ్రీ నర్శింగ్, పీజీ నర్శింగ్ కళాశాలలు కూడా కొత్తజిల్లాల్లోనే ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర వైద్యసేవలకు కావాల్సిన వైద్యులను, పారామెడిక్స్ ను ప్రభుత్వ కళాశాలలు, యూనివర్శిటీల ద్వారా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, వాణిజ్యం అభివ్రుద్ధి చెందాలంటే అక్కడ నూతన వంగడాల ఆవిష్కరణలు జరగాలి.. అలా జరగాలపంటే పరిశోధనలు జరగాలి. దానికోసం యూనివర్శిటీలు ఏర్పాటు ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నది. కేజీ నుంచి పీజీ వరకూ మొత్తం విద్యను ప్రభుత్వపరంగా అందించడం ద్వారా విద్యతోపాటు, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పూర్తిస్థాయిలో కల్పించవచ్చుననే ఆలోచనకు ప్రభుత్వం వచ్చంది. ఐటీ రంగాన్ని అభివ్రుద్ధి చేయడం ద్వారా సాఫ్ట్ వేర్ హబ్ లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. దానికోసం యూనివర్శిటీ స్థాయిలోనే పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని కూడా అంచనాలు వేస్తున్నారు. దానికోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి జిల్లాల్లో ఐటీ హబ్ లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే పాఠశాల విద్య నుంచి ఇంటర విధ్య వరకూ ఆరు విధానాలను అమల్లోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం ఆపై డిగ్రీ, పీజీలలో కూడా సరికొత్త విధానాలను అమలు చేయడం ద్వారా విద్యార్ధి చదువుకునే సమయంలోనే ఏదో ఉద్యోగానికి ఎంపిక అయ్యేలా కూడా కార్యాచరణ చేపడుతున్నది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలకు ధీటుగా కొత్త విద్యా విధానాలు, కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్ధులుగా ఉన్నప్పుడే ఉద్యోగులుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయినందున ఏఏ కొత్త జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలనే కోణంలో ఇప్పటికే ప్రభుత్వం నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2014 నాటి  26 జిల్లాల్లో 26 యూనివర్శిటీలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.