తెరపైకి కొత్తగా మున్సిపల్ కార్పోరేషన్లు..
Ens Balu
4
Tadepalli
2022-04-25 01:29:42
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని 13 జిల్లాలను 26జిల్లాలుగా విభజించింది. అదే సమయంలో ప్రధాన జిల్లాల్లో అంతర్భాగంగా వున్న మున్సిపల్ కార్పోరేషన్ లను మరోసారి విభజించే ప్రక్రియ చేపట్టాలని యోచిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని ప్రస్తుతం వున్న మున్సిపల్ కార్పోరేషన్లు ఏఏ జిల్లాలకు అందర్భాలుగా ఉన్నాయి..కొత్త జిల్లాల్లో అయితే ఏఏ జిల్లాల్లో మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలి. అనే అంశాలను పట్టణ పురపాలక శాఖ ద్వారా అంచనాలు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. జిల్లాలను విభజించిన ప్రభుత్వం ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లను కూడా విభజించకపోతే అభివ్రుద్ధి పూర్తిగా కుంటుపడిపోతుంది. జనాభాలెక్కల ప్రాతిపదిక కూడా 2026నాకిటి ఈ ప్రక్రియ పూర్తిజరగాల్సి వుంది. దానికోసం ప్రస్తుతం ఏ మున్సిపల్ కార్పోపరేషన్ పరిధి ఏ కొత్తజిల్లాలో భాగంగా వుంది. ఏ జిల్లా నుంచి మున్సిపల్ కార్పోరేషన్ ను విడదీసి ఏ జిల్లాలో కొత్తగా మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కొత్తజిల్లాలతోపాటు, మున్సిపల్ కార్పోరేషన్లను కూడా విభజించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీల నిధులు అధికంగా వచ్చే వెసులు బాటు వుంది. అదే సమయంలో జిల్లాలు మారిపోయిన తరువాత ఏ ప్రధాన పని కావాలన్నా ఇపుడు పాత జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అలా చేసిన సమయంలో జిల్లా పేరు, ద్రువీకరణ మారిపోతుంది. ప్రస్తుతం కొత్తజిల్లాలు విభజన జరిగిపోయిన తరువాత చాలా మంది ఆధార్ కార్డులు, ఇతర ఇంటి అడ్రసులన్నీ మార్పులు చేర్పులు చేయించుకుంటన్నారు. ఇలాంటి సమయంలో నగరపాలక సంస్థ పరిధిలో కూడా మార్పులు చేయించుకోవాలంటే కొత్తగా మారిన జిల్లాల్లోనే కొత్త కార్పోరేషన్లు ఉండాలి. అలా కాకుండా జిల్లా ఒక దగ్గర, కార్పోరేషన్ ద్రువీకరణ మరో జిల్లాలోనూ ఉంటే సాంకేతిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం వుందని ప్రభుత్వం గుర్తించి నట్టు సమాచారం. ఉదాహరణకు మహావిశాఖ నగరపాలక సంస్థనే తీసుకుంటే శివారు ప్రాంతమైన అనకాపల్లి జిల్లా జివిఎంసీ పరిధిలో వుంటుంది. నేటికీ జివిఎంసీ జోనల్ కార్యాయలయం అనకాపల్లిలోనే వుంది. కానీ జిల్లా మారినపుడు, నరగరపాలక సంస్థ కూడా మారాలి. కానీ నేటికీ మారలేదు. ఇదే విషయాన్ని ఇటు జివిఎంసీ అధికారులు, ఇటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టర్, జేసిలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లనట్టు సమాచారం అందుతుంది. దీనితో కొత్త జిల్లాల పరిధిని బట్టి, మున్సిపాలిటీలుగా వున్నవాటిని కలుపుతూ, నగర పాలక సంస్థలుగా మార్చాలా, లేదంటే జిల్లా కేంద్రంలోనే మున్సిపల్ కార్పోషనర్లు ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా మంతనాలు చేస్తోంది. కొత్తజిల్లాల్లో కొత్త మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలపై జూలై నెలాఖరుకి ఒక కొలిక్కి వస్తుందని తెలుస్తుంది. అదే జరిగితే జివిఎంసీ నుంచి అనకాపల్లి విడిపోయి.. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకూ పరిధిని పెంచి అనకాపల్లి మున్సిపల్ కార్పోరేషన్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జివిఎంపీ పరిధిలో పలు అనుమతుల కోసం పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం ఆలోచిస్తున్నతీరు, కొత్త జిల్లాలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వుంది. మహానగరపాలక సంస్థలను విడదీస్తారా.. కొత్త నగరపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారా.. అలాకాకుండా ఎక్కడి కార్పోరేషన్లను అక్కడే వుంచి పరిపాలనా సౌలభ్యం కోసం కొద్ది పాటి మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి..