సమాచారశాఖలో ఆర్జేడి వ్యవస్థకు మంగళం


Ens Balu
7
Tadepalli
2022-04-29 07:49:55

సమాచార పౌరసంబంధాల శాఖలో ముఖ్యంగా మీడియాకి సకాలంలో సమాచారం అందిం చాలంటే కావాల్సిన అధికారులు డీపీఆర్వో, ఏపీఆర్వో, ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్, టైపిస్టు(పత్రికా పరిభాషలో హార్మోనిస్టు అంటారు అంటే వార్తలు కంపోజ్ చేసేవాడు అని అర్ధం) అవన్నీ లేకపోయినా.. సమాచార శాఖలో మాత్రం కార్యాలయ సిబ్బంది చక్కగా నిండుగా, మెండుగా ఉన్నారు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారంతా ఉత్సవ విగ్రహాలే. వారి వలన కొత్తజిల్లాల్లో డీపీఆర్వోలకు శిరోభారం తప్పా మరెలాంటి ఉపయోగం కొద్దిగైనా లేదు. అలాంటి తరుణంలో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాలకు మీడియాకి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, ముఖ్యమైన కార్యక్రమాల వీడియో విజువల్స్ అందించడానికి కావాల్సిన సిబ్బందిని నియమించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సమాచారశాఖలోని ఆర్జేడీ కార్యాలయాల దుఖాణాలు సర్దేసి అందులోని సిబ్బందిని సమాచారశాఖ అప్పగించింది. పనిచేయని సిబ్బంది వందమంది ఉంటే ఏ సుఖం అన్నట్టుగా  సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచార పౌర సంబంధాల శాఖకు ఆర్జేడీ కార్యాలయాల నుంచి వచ్చిన సిబ్బంది వలన కార్యాలయం నిండుగా కనిపిస్తుంది తప్పతే  ప్రతినిత్యం ఉపయోగ పడే సిబ్బంది తక్కువనే చెప్పాలి. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా డీపీఆర్వో కార్యాలయాలకు కావాల్సిన ఏపీఆర్వోలను మాత్రం నియమించడం లేదు. ఆర్ధిక భారం నెపంతో ఉన్న సిబ్బందిని సర్దేయడంతోపాటు,  విభాగాలను ఉన్న శాఖలోనే అనుసంధానం చేసి అక్కడ పనిచేసే అధికారులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేసేస్తున్నది.  ప్రభుత్వ శాఖల్లో విభాగాలను కుదించేసే కార్యక్రమాలు శరవేగంగా చేపట్టింది. దానికోసం ప్రాధాన్యత లేని విభాగాలు వ్యవస్థలకు మంగళం పాడేస్తుంది. ఇటీవలే సమాచార పౌర సంబంధాల శాఖలో ఆర్జేడీ(రీజనల్ డైరెక్టర్) కార్యాలయాలను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలో నాలుగు జోన్లలో నాలుగు ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నా వాటి వలన ప్రభుత్వానికి గానీ, మీడియా సంస్థలకు గానీ సమాచారశాఖ ద్వారా ఎలాంటి ఉపయోగం కూడా లేదు. దీనితో రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఉన్న ఆర్జేడీ పోస్టులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. అక్కడి కార్యాలయ సిబ్బంది కొత్త జిల్లాల్లోని డిపీఆర్వో కార్యాలయాల్లోకి సర్ధుబాటు చేసేసింది. సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచారశాఖకు సిబ్బందిని అలా సర్ధుబాటు చేసింది. ఉన్న కార్యాలయ సిబ్బందితో అదనంగా ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది వచ్చి చేరారు తప్పితే కొత్త జిల్లాల్లో పనిచేసే డీపీఆర్వోలకు సహకారంగా, సాంకేతిక సహాయం అందించే సిబ్బంది నేటికీ లేకపోవడం, ప్రభుత్వం నియమించకపోవడంతో అన్ని పనులు డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి వీరికి వాహనాల సదుపాయం కూడా లేకపోవడంతో వారి సొంత వాహనాల్లో ప్రభుత్వ కార్యాక్రమాల ప్రెస్ కవరేజికి వెళుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిగా వీరంతా ప్రభుత్వాన్నికానీ, సమాచారశాఖ కమిషనర్ ను గానీ అడిగే పరిస్థితి లేదు. ఒక వేళ ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు ద్రుష్ట్యా దైర్యం చేసి అడిగినా.. ఏపీఆర్వోలను గానీ, ప్రెస్ కవరేజికి సరపడే సిబ్బందిని గానీ నియమించే పరిస్థితి అంతకంటే లేదు. వాస్తవానికి ఏ ప్రభుత్వ శాఖలో సిబ్బంది, అధికారులు ఉన్నా లేకపోయినా సమాచార, పౌర సంబంధాల శాఖలో మీడియాకి సమాచారం అందించేందుకు అన్ని విభాగాల సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది కానీ గద పదేళ్లుగా ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ నియామకాలే తప్పితే కొత్త నియామకాలు జరిగింది లేదు. పోనీ ఉన్నవారికైనా పనొచ్చా అంటే అదీ లేదు. దీనితో కొత్తజిల్లాలతోపాటు, పాత జిల్లా కేంద్రాల్లో కూడా డీపీఆర్వోలు నరకం చూడాల్సి వస్తుంది. ఈ సాంకేతిక సమస్యను సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర అధికారులు ఎప్పుడు గుర్తిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది.