కోల్‌కతాకు చెందిన సుమిత్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్‌డి ప్రకాష్ చౌదరి గురువారం ఉదయం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.50 లక్షల విలువచేసే 10 బగ్గీలను విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి దాత వాహనాలను అందజేశారు. అనంతరం వాటికి పండితులతో పూజా కార్యాక్రమాలు నిర్వహించి వాటిని ప్రారంభించారు. ఈ బగ్గీలను శ్రీవారి ఆలయానికి ముఖ్యంమంత్రి, ప్రధాన మంత్రి, గవర్నర్, రాష్ట్రపతి వంటి ప్రముఖులు వచ్చిన సందర్భంలో వీటిని వినియోగించనున్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ ఎం.జానకిరామ్ రెడ్డి పాల్గొన్నారు.