తిరుమలలోని పిఏసి- 2లో భక్తుల కోసం అన్నప్రసాద సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 కారణంగా 2020 మార్చిలో టిటిడి పిఎసి-2 వద్ద అన్నప్రసాదాన్ని మూసివేయగా, మళ్లీ ఈరోజు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం డెప్యూటీ ఈవో పద్మావతి పూజలు నిర్వహించి రెండేళ్ల తర్వాత అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. దీనితో మళ్లీ శ్రీవారి భక్తులకు పిఏసి-2లో అన్నప్రసాదం అందుబాటులోకి వచ్చించి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి, ఇతర అదికారులు పాల్గొన్నారు.