గాల్లోనే మహిళా పోలీసు సర్వీసు ప్రొబేషన్


Ens Balu
1
Tadepalli
2022-05-06 05:09:18

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిత్యం ఏదో ఒక తేడా వ్యవహారంతో వార్త ల్లో నిలుస్తూనే ఉంటంది. ఇపుడు కూడా ఇదే శాఖలో పనిచేసే మహిళా పోలీసుల సర్వీస్ ప్రొబేషన్ విషయంలోనూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై, అందులో పనిచేసే ఉద్యోగులు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసు కుంటే వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం ఆదిలోనే ప్రకటించింది. ఆతరు వాత అక్టోబరు 2021 నవంబరు2 కి రెండేళ్లు పూర్తయినా..వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. తరువాత మరో 9నెలలు గడుపు పొడిగించి ఆపై సర్వీస్ రెగ్యులర్ కావాలంటే పరీక్ష పాస్ కావాలనే నిబంధన పెట్టింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 400 పైచిలుకు మహిళా పోలీసులు పరీక్షలు రాసి పాసయ్యారు. కానీ ప్రభుత్వం వారి పరీక్షల రిజల్ట్ ను ప్రకటించలేదు. కానీ రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి మాత్రం సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులు ప్రభుత్వం పెట్టిన టెస్టు పాసైతే రిజల్టు ఇచ్చేవారని, మీరంతా ఆ టెస్టులు పాస్ కానప్పుడు మేము మీ సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలు పై ఎలా సంతకాలు చేస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఎంపీడీఓలు, వార్డుల్లో జోనల్ కమిషనర్లు మొరాయిస్తూ ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లను వెనక్కి పంపేస్తున్నారు. ఈ విషయం మహిళా పోలీసుల మాత్రుశాఖ అయిన హోం డిపార్ట్ మెంట్ కి తెలిసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో డీజీపీగానీ, జిల్లా స్థాయిలో ఎస్పీలుగానీ వీరి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో తమ రెండేళ్ల 9నెలల ప్రొబేషన్ సర్వీసు గాల్లోనే ఉండిపోయిందనీ, మిగిలిన శాఖల సిబ్బందికి ఎంపీడీఓలు ప్రొబేషన్ క్లియరెన్సు సంతకాలు చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా వున్న సచివాలయ మహిళా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల నియామకాలు రాజ్యాంగ విరుద్దంగా జరిగాయనే కేసు హైకోర్టులో పెండింగ్ లోవుంది. ఇవేకాకుండా ఖాకీ యూనిఫారం విషయంలోనూ, పదోన్నతిల విషయంలో మరో కేసు కోర్టులో వుంది. సచివాలయ వ్యవస్థపై అధికంగా హైకోర్టులో కేసులు ఉన్నప్పటికీ మహిళా పోలీసుల విషయంలో మాత్రం కేసులు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటున్నాయి. ఇదే తరుణంలో సచివాలయ మహిళా పోలీసులు ఉద్యోగాలు సర్వీసు ప్రొబేషన్ తరువాత రెగ్యులర్ చేయకుండా ఉంటే ఈ మొత్తం ఉద్యోగాలు రద్దు అయినా రద్దు అవుతాయనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా ఇదే విషయమై చాలా మీడియా ఛానళ్లు, పత్రికలు, ఆఖరికి సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో డిబేట్లు జరుగుతున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే రెగ్యులర్ ఉద్యోగులకు 33 నెలలపాటు ప్రొబేషన్ చేయించింది ఏపీ ప్రభుత్వం. ఇంత చేసినా వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా అనే అనుమానం నేటికీ ఉద్యోగులను వెంటాడుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. దీనితో సచివాలయ మహిళా పోలీసులకు తీవ్రమైన భయం పట్టుకుంది. వీరికి ప్రభుత్వం పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని నేటికీ ప్రకటించకపోవడం, రెండేళ్లు పూర్తిచేసుకున్నవారికి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ పై ఎంపీడీఓలు సంతకాలు చేయకపోవడం వీరిని మరింతగా భయపెడుతూ, తీవ్రంగా ఆందోలన కలిగిస్తున్నాయి.

 ఈ క్రమంలో అటు ప్రభుత్వంలో నుంచి గానీ, ఇటు జిల్లా పోలీసుశాఖ  నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాకపోతే వీరి పరిస్థితి, వీరి సర్వీసు ప్రొబేషన్ నిజంగానే గాల్లోనే ఉండిపోయే పరిస్థితులు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏపీలో ఏర్పాటైన దగ్గర నుంచి ఈశాఖ యొక్క అన్ని రకాల తాజా సమాచారాలను, జరుగుతున్న తప్పులను, ఈ శాఖ ద్వారా ప్రజలకు అందే సేవలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net  ద్వారా అందిస్తూ వచ్చే కార్యక్రమంలో భాగంగానే మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో కూడా జరుగుతున్న జాప్యం, అధికారులు స్పందించకపోవడం, మండల స్థాయిలో ఎంపీడీఓ సదరు ఫైళ్లపై సంతకాలు చేయకపోవడమనే విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఈఎన్ఎస్ ఎల్లప్పుడూ తమవంతు సహకారం అందిస్తుందనే విషయాన్ని కూడా మరోసారి ఈ సందర్భంగా ప్రకటిస్తుంది. చూడాలి ప్రభుత్వం ఇప్పటికైనా సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది, వారికి ఏ తరహా బరోసా ఇస్తుందో..!