రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకంలో నిర్మాణం చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్ అధికారులను ఆదేశించేరు.ఇళ్ళ నిర్మాణ పనుల ఫై అలసత్వం ప్రదర్శించవ ద్దుని,లక్ష్యాలను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేసేరు. జిల్లాల హౌసింగ్ హెడ్స్,ఇతర అధికారులు ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ చేయడం ఫై ప్రత్యెక ద్రుష్టి సారించాలని,రూఫ్ లెవెల్ కు వచ్చిన ఇంటి నిర్మాణాలు పూర్తీ చేయడానికి యుద్ద ప్రాతిపదిక ఫై పనిచేయాలని ఆయన స్పష్టం చేసేరు.వీటితో పాటు ఆప్షన్-III కింద మంజూరు అయిన ఇళ్ళు నిర్మాణ పన్నులన్నీ అన్ని ఈ నెల 31వ తేది లోపల ప్రారంభం చేయాలని మంత్రి ఆదేశించేరు .రాష్ట్రంలోని అన్నిజిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులు,ఇంజినీర్లు,ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్యాలయం నుంచి వీడియో సమావేశం ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రతి అధికారి లక్ష్యాలును పూర్తి చేయాలని ప్రతి 15రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని,అధికారులందరూ ఇళ్ళ నిర్మాణాల పూర్తికి కృషి చేయాలని మంత్రి స్పష్టం చేసేరు. లేఅవుట్ ల వారిగా నియమితులైన నోడల్ అధికారులు సత్వరమే ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ కావటానికి మున్సిపల్ కమిషనర్లు,పంచాయితీరాజ్,విద్యుత్ ఇతర శాఖల అధికారులులతో సమన్వయం చేసుకోవాలని,నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాలూ కల్పించి లబ్దిదారులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేసేరు.ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీరు ,అంతర్గత రహదారులు విద్యుత్ లైన్లు తొలగింపు తదితర మౌలిక వసతుల పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించేరు.ఇళ్ళ నిర్మాణాలకు సంభందించిన పనులలో ఎటువంటి జాప్యం పనికిరాదని లబ్దిదారులకు ఏవిధమైన సహకారం కావాలన్న అందిచాలని మంత్రి విజ్ఞప్తి చేసేరు.గృహనిర్మాణ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,జిల్లాల ప్రత్యెక అధికారులు రాష్ట్రంలోని అన్ని లేఔట్లను సందర్శించి ఇళ్ళనిర్మాణాల వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కోరేరు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులందరినీ ఇళ్ళ నిర్మాణాలలో భాగస్వాములు చేయాలని మంత్రి స్పష్టం చేసేరు.
ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్ మాట్లాడుతూ అన్ని లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు,జియో టేగింగ్ తదితర పనులును వెంటనే పూర్తీ చేయాలని ఆదేశించేరు.ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా,జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివ ప్రసాద్,ఎగ్జికూటివ్ డైరెక్టర్ ఎం.కమలాకర బాబు,రాష్ట్రంలోని అన్ని జిల్లా హౌసింగ్ హెడ్స్,డివిజనల్ అధికారులు,ఇంజినీర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.