శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫోటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి, తిరుమలకు తీసుకువెళ్ళడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. ఇది టీటీడీ ఎన్నో దశాబ్ధాలుగా అనుసరిస్తున్న నిబంధన. ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేస్తున్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది.