వైఎస్సార్ మత్స్యకార భరోసా 13కి వాయిదా..
Ens Balu
1
Tadepalli
2022-05-10 11:30:37
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసని తుఫాన్ ప్రభవావం ఉన్నందున ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13 (శుక్రవారానికి) కు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్తమానం పంపించారు. ఈ విషయాన్ని మత్స్యకారులకు తెలియాలని జిల్లా కలెక్టర్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు, సచివాలయాల పరిధిలోని మత్స్యశాఖ సహాయకుల ద్వారా తెలియజేయాలని సూచించారు.