వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?


Ens Balu
6
Tadepalli
2022-05-18 04:56:47

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలాఖరు నాటికి పండుగ వస్తుందా అంటే ఏమో  ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు.. అదేంటి అనుకుంటున్నారా.. మాకూ(మీడియాకి కూడా) అదే డౌటనుమానం వచ్చింది. వాస్తవానికి ఏప్రభుత్వ శాఖలో అయినా ఉద్యోగంలో చేరిన రెగ్యులర్ ఉద్యోగికి రెండేళ్లు మాత్రమే సర్వీసు ప్రొబేషన్ ఉంటుంది. రెండేళ్లు దాటగానే ఆటోమేటిక్ గా సర్వీసు రెగ్యులర్ చేస్తూ సాధారణ ఉద్యోగిలా మారుస్తుంది ప్రభుత్వం. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానమేమో.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివాలయ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 33 నెలలు అంటే రెండేళ్ల 9 నెలలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ప్రొబేషన్ సర్వీసు చేయిస్తోంది ఆ రూ.15వేలు మాత్రమే జీతం ఇస్తూ(కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఇదే ప్రభుత్వం నెలకు రూ.18వేలు ఇస్తోంది).. ఆ క్రమంలోనే జూన్ నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. దీనితో జూన్ నెల ఎప్పుడు వస్తుందా అంతా ఎదురు చూశారు. జూనెల నెల రావడానికి ఇంకా 13  రోజులు మాత్రమే గడువు వుంది. అయినా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి క్యాబినెట్ భేటీలో కూడా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ పై ప్రకటన వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రకటన రాకపోవడంతో అంతా నిరాశ చెందారు. కానీ రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగుల నుంచి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా శాఖల అధికారులు మాత్రం రెగ్యులైజేషన్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తిచేస్తుంది. ఇంత జరుగుతున్నా ఉద్యోగుల్లో మాత్రం సర్వీసు రెగ్యులర్ అవుతుందా అంటే మళ్లీ ప్రొబేషన్ సర్వీస్ పొడిగిస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్పితే పక్కాగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో అటు ప్రభుత్వం కూడా జిల్లాశాఖ అధికారులకు సరైన సమాచారం, ఆదేశాలు ఇవ్వకపోవడమే కారణంగా కనిపిస్తుంది.  రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను 9నెలల క్రిందట రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఆఖరి 8వనెల అపుడే సగానికి పైగా రోజులైపోయినా.. ప్రభుత్వం నుంచి మాత్రం చిన్న ప్రకటన కూడా రాలేదు. చూడాలి జూన్ నెలలోనైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ.. వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నామనే ప్రభుత్వ ప్రకటన వస్తుందో లేదోనని..!