ఏపీ ఎలక్టోరల్ చీఫ్ గా ముకేష్ కుమార్ మీనా


Ens Balu
5
Tadepalli
2022-05-19 12:22:37

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరవతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఛాంబరుకు మద్యాహ్నం 12.00 గంటలకు విచ్చేసిన ఆయన 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ముకేష్ కుమార్ మీనా ను   కె.విజయానంద్  దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు ఆయన పరిచయం చేశారు.